ఖైదీ నెం 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర పోషించి తన కల నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాలతో చిరు చేయి కలపగానే ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ఈ మూవీపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తొలుత సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్ట్ రోల్ చేస్తాడన్న పుకార్లు వచ్చాయి. కానీ, తన తనయుడు, నిర్మాత రామ్ చరణ్ ఆ పాత్ర చేస్తున్నాడని స్వయంగా చిరంజీవే ప్రకటించాడు. ఆచార్యలో చెర్రీ పాత్ర గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలిశాయి. అతనిది అతిథి పాత్ర మాత్రమే కాదు.. దాదాపు 30 నిమిషాల నిడివితో కూడిన బలమైన పాత్ర అని తెలిసింది. అంతేకాదు అతను మాజీ నక్సలైట్‌గా కనిపిస్తాడని, ఓ మిషన్‌లో పని చేస్తుండగా ప్రాణాలు కోల్పోతాడట.
Also Read: సినిమాకు వంద కోట్లు.. దేశంలో ప్రభాస్ ఒక్కడే!
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు రామ్ చరణ్ పాత్ర వస్తుందని సమాచారం. దాంతో మూవీ అనూహ్య మలుపు తీసుకోవడంతో పాటు ద్వితీయార్థంపై మరింత ఆసక్తి పెంచుతుందట. ఇంటర్వెల్‌కు ముందు మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని, దాంతో పాటు రోమాంచిత అనుభవం ఇచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కోసం ఓ పాట, చిరంజీవితో ఓ ఫైట్ కూడా ఉంటుందని సమాచారం. సినిమాలో అదే అతిపెద్ద సర్ప్రైజ్ కానుంది.
Also Read: టబును ఘాడంగా ప్రేమిస్తున్నాడట !
చిరుతో చెర్రీ సన్నివేశాలను కొరటాల ఎప్పుడూ చూడని విధంగా తెరకెక్కించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాడని విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. మొత్తంగా ఆచార్యలో చరణ్ పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుందనేది మాత్రం స్పష్టమవుతోంది. మగధీర, బ్రూస్‌లీలో చిరు.. ఖైదీ నెం.150లో చెర్రీ అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి అరగంట పాటు తెరపై కనిపించడం మెగా ఫ్యాన్స్‌కు పండగే. ఈ మూవీలో చిరు నక్సలైట్ పాత్ర పోషిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆగిన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.