https://oktelugu.com/

Ram Charan : నా జీవితాన్ని తలక్రిందులు చేసిన సినిమా అదే..ఆ డైరెక్టర్ ని మర్చిపోలేను అంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

ఈ ఎపిసోడ్ లో బాలయ్య రామ్ చరణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ 'నీ కెరీర్ లో పరమ చెత్త సినిమా, అసలు ఎందుకు చేసానురా బాబు అని అనిపించిన చిత్రం ఏదైనా ఉందా' అని అడగగా, ఆడిటోరియం నుండి అభిమానులు 'తుఫాన్..తుఫాన్' అని అరుస్తూ ఉంటారు

Written By:
  • Vicky
  • , Updated On : January 8, 2025 / 09:30 PM IST

    Ram Charan Unstoppable 4' Show

    Follow us on

    Ram Charan :  ప్రతీ హీరో కెరీర్ లోనూ సూపర్ హిట్ సినిమాలు ఉంటాయి, డిజాస్టర్ సినిమాలు ఉంటాయి. కొంతమంది హీరోలకు ఎక్కువ డిజాస్టర్ సినిమాలు కూడా ఉండొచ్చు. ఎంత పెద్ద డిజాస్టర్ అయినా ఆ సినిమాలో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. కానీ కొన్ని డిజాస్టర్ సినిమాల్లో అయితే అసలు ఎందుకు చేశాను రా బాబు అని బాధపడే రేంజ్ లో ఉంటాయి. అలాంటి సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఉందట. రీసెంట్ గానే ఆయన నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ 4 ‘ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్ లో ఆయన ఎన్నో ప్రశ్నలకు సమాదానాలు చెప్పాడు. కొన్ని చెప్పడానికి సిగ్గు పడినప్పటికీ, ఎక్కువ శాతం మాత్రం చెప్పడానికే ప్రయత్నం చేసాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహా మీడియా యాప్ లో అందుబాటులో ఉంది.

    అయితే ఈ ఎపిసోడ్ లో బాలయ్య రామ్ చరణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నీ కెరీర్ లో పరమ చెత్త సినిమా, అసలు ఎందుకు చేసానురా బాబు అని అనిపించిన చిత్రం ఏదైనా ఉందా’ అని అడగగా, ఆడిటోరియం నుండి అభిమానులు ‘తుఫాన్..తుఫాన్’ అని అరుస్తూ ఉంటారు. అప్పుడు రామ్ చరణ్ నవ్వుతూ ‘ఆ సినిమానే సార్..అనవసరంగా అమితాబ్ బచ్చన్ గారి క్లాసిక్ ని రీమేక్ చేసి చెడగొట్టాననే ఫీలింగ్ నాలో ఇప్పటికీ ఉంది’ అని చెప్పుకొస్తాడు. అప్పుడు బాలయ్య నా కెరీర్ లో కూడా అలాంటి రాడ్స్ చాలానే ఉన్నాయి అని అంటాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఎన్నో సరదా మొమెంట్స్ ఈ ఎపిసోడ్ లో జరిగాయి. రామ్ చరణ్ స్నేహితులు శర్వానంద్, వికాస్ వంటి వారితో పాటు గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొని సందడి చేసాడు.

    ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరు ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలతో పోటీ పడబోతున్నారు. రెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ చిత్రానికి భారీ బిజినెస్ జరిగింది, క్రేజ్ కూడా ఈ చిత్రానికే ఎక్కువ ఉంది. ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియా నే కనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడిప్పుడే చిన్నగా మొదలు అవుతున్నాయి. తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. టికెట్ హైక్స్ జీవో కోసం నిర్మాత దిల్ రాజు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు రాత్రికి బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డాకు మహారాజ్ కి ఎలాంటి టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ అవసరం లేదని ఆ చిత్ర నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు.