Ram Charan Career Dilemma: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా ‘చిరుత’ సినిమాతో తను మాస్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత ‘మగధీర’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. రెండో సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ ను బద్దలు కొట్టిన హీరోగా అతనికంటూ ఒక క్రేజ్నైతే ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఆ తర్వాత కాలంలో పూర్తిగా కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక రంగస్థలం సినిమాతో తనలోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీసిన రామ్ చరణ్ మొత్తానికైతే నటన పరంగా తన మీద వచ్చిన విమర్శలను తిప్పి కొట్టాడు. ఇక ఇప్పుడు ఆయన పాన్ ఇండియా బాట పట్టిన విషయం మనకు తెలిసిందే. ‘త్రిబుల్ ఆర్’ సినిమా సక్సెస్ అయినప్పటికి దానికి దానికి రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కి కూడా క్రెడిట్ దక్కింది.
‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సైతం భారీ నష్టాలను మిగుల్చడంతో ఆ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయాయి.
ఇక రీసెంట్ గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ఓకే అనిపించినప్పటికి రామ్ చరణ్ నుంచి రావాల్సిన సినిమా అయితే కాదని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? రాబోయే సినిమాలతో ఆయన తన మార్కెట్ విపృతంగా పెంచుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పూర్తిగా గాడి తప్పాడు. అతనికి ఎవరు ఆ కథలను సజెస్ట్ చేశారో తెలియదు కానీ ఆ కథల్లో ఏమాత్రం కంటెంట్ లేకుండా పోయింది. స్క్రీన్ ప్లే తో సినిమా ను నడిపించే ప్రయత్నంలో దర్శకులైతే ముందుకు సాగారు. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా కానీ తన బాడీని బిల్డ్ చేయడంలో గాని తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదనే చెప్పాలి…
