Homeజాతీయ వార్తలుPetrol Diesel Tax Reduction: పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గింపు.. వినియోగదారుడికి ఎటువంటి లాభం?

Petrol Diesel Tax Reduction: పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గింపు.. వినియోగదారుడికి ఎటువంటి లాభం?

Petrol Diesel Tax Reduction: ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ కొరత విషయంలో ఆందోళన వాతావరణం నెలకొంది. పెట్రోల్ ఉండదనే కారణంతో భయాందోళన చెందిన చాలామంది వినియోగదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు కూడా పెంచే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. కానీ ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వినియోగదారులకు ఉపశమనం కలిగిందని కొందరు అంటున్నారు. కానీ వాస్తవానికి ఈ తగ్గింపు ధరలు వినియోగదారులకు వర్తిస్తాయా? లేదా పెట్రోల్ బంకుల యజమానులకేనా? అన్న సందేహం కలుగుతుంది. దీనిపై కొందరు నిపుణులు ఏమంటున్నారంటే?

పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం తాజాగా సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై రూ.13 నుంచి రూ.3 వరకు.. డీజిల్ పై రూ.10 నుంచి 0 వరకు తగ్గించారు. ఇవి మార్చి 26 నుంచి అమల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ఉన్నా కూడా పెట్రోల్, డీజిల్ పై సుంకాలను తగ్గిస్తే వినియోగదారులకు ఉపశమనం కలిగే అవకాశం ఉందా? దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియా సంక్షోభంలో ధరలు పెరగకుండా చూడడానికే ప్రయత్నిస్తామని అన్నారు. అయితే నోమురా వంటి వారు ఈ తగ్గింపు తక్షణమే ప్రభావం చూపకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పచ్చిమాసియాలో క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 16 చేరాయి. దిగుమతుల వ్యయం పెరగడం, హార్మోజ్ జల సంధిలో ఏర్పడిన సమస్యల వల్ల చమురు కంపెనీలకు భారీగా ఒత్తిడి ఏర్పడింది. దీంతో ఆయిల్ కంపెనీలకు కొంతమేర భారం తగ్గించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సుంకాల తగ్గింపు వల్ల సగటు వినియోగదారుడికి ఎలాంటి పెట్రోల్ ధర తగ్గింపు వర్తించే అవకాశం ఉండదు.

Also Read: నిన్న త్రివిధ దళాధిపతులు.. రేపు సీఎంలతో.. మోడీ ఏదో చేయబోతున్నాడు?

ప్రస్తుతం హైదరాబాదులో పెట్రోల్ ధరలు 107.45 తో విక్రయిస్తున్నారు. డీజిల్ ధరలు 95.70 కా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ ప్రభావం కూడా బాగానే ఉంటుంది. కేంద్రం సుంకాలు తగ్గించినా కూడా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకపోతే వినియోగదారుడికి ఉపశమనం కలిగే అవకాశం ఉండదు. అయితే అంతర్జాతీయంగా పరిస్థితులు స్థిరంగా ఉంటే ప్రస్తుతానికి వినియోగదారుడికి ధరల పెంపు లేనట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే మొదటి వరకు పెట్రోల్ కొరత ఉండడంతో ధరలు పెరుగుతాయన్న ఆందోళన ఉండేది. అంతేకాకుండా ప్రీమియం పెట్రోల్ ధరలు పెంచడంతో సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version