Homeఎంటర్టైన్మెంట్Ram Charan Ayyappa Mala Controversy: రామ్ చరణ్ అయ్యప్ప మాలపై విమర్శలు.. దిమ్మతిరిగే సమాధానం...

Ram Charan Ayyappa Mala Controversy: రామ్ చరణ్ అయ్యప్ప మాలపై విమర్శలు.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అల్లు శిరీష్!

Ram Charan Ayyappa Mala Controversy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రతీ ఏడాది అయ్యప్ప మాల ధరించే విషయం అందరికీ తెలిసిందే. ఏ ఒక్క ఏడాది కూడా ఆయన అయ్యప్ప మాల ధరించకుండా లేడు . చాలా నిష్ఠతో ఉంటాడు. అలాంటి రామ్ చరణ్ రీసెంట్ గా అల్లు అర్జున్ తన సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి అందర్భంగా గ్రాండ్ గా ఒక పార్టీ ని ఏర్పాటు చేయగా , ఈ పార్టీ కి రామ్ చరణ్ అయ్యప్ప మాలతోనే విచ్చేస్తాడు. మహా అపచారాం , అయ్యప్ప మాల ధరించిన ఒక వ్యక్తి , మందు పార్టీ కి రావడం ఏంటి ?, రామ్ చరణ్ హిందూ దేవుళ్ళ సంప్రదాయాలను బ్రష్టు పట్టిస్తున్నాడు అంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు . అయితే దీనిపై అల్లు శిరీష్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక అభిమాని పెట్టిన కామెంట్ కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు.

రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నాడు కదా , ఇలాంటి పార్టీ లకు ఎలా వచ్చాడు అని అడగ్గా , దానికి అల్లు శిరీష్ సమాధానం చెప్తూ ‘అవును..అయ్యప్ప మాల ధరించాడు. అందుకే మేమెవ్వరం ఆల్కహాల్ ముట్టుకోక ముందే మమ్మల్ని కలిసి , శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయాడు. కేవలం మేము పిలిచినందుకు మాత్రమే మాకోసం వచ్చి వెళ్ళిపోయాడు. అయ్యప్ప స్వామి మీద ఆయనకు ఉన్న నిష్ఠ భక్తికి ఇదొక నిదర్శనం’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. దీంతో సోషల్ మీడియా లో రామ్ చరణ్ పై వచ్చే ఈ విమర్శలకు చెక్ పడింది. రామ్ చరణ్ ఏ చిన్న విషయం లో అయినా దొరకకుండా పోతాడా ?, ట్రోల్ చేయకుండా రెడీ గా ఉండాలి అని కొంతమంది ఆయన మీద ద్వేషం తో నోటికి వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటారు. మాలలో ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం కూడా పాపమే అని అభిమానులు అంటున్నారు .

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఏప్రిల్ 30 న ఈ చిత్రం విడుదల అవ్వబోతుండగా , మేకర్స్ చెప్పిన సమయానికి సినిమాని పూర్తి చేసేందుకు ఎంతో కస్పాడుతున్నారు. ఇంకా 20 రోజుల షూటింగ్ 70 రోజుల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలన్స్ ఉందట. మరి ప్లాన్ కి తగ్గట్టు అన్నీ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తారా ?, లేదా మరో డేట్ కి వాయిదా వేస్తారా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ పాటకు ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెండవ పాటని మార్చి 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular