Bigg Boss 10 Telugu: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ రియాలిటీ షో కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రియాలిటీ షోకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ ఉంది. గత సీజన్ అయితే బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకున్న సీజన్ గా నిలిచిపోయింది. గత సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అందుకే తదుపరి సీజన్ పై ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈసారి సెలబ్రిటీల క్యాటగిరీ నుండి టాప్ మోస్ట్ స్టార్స్ ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు మేకర్స్. అదే విధంగా మేకర్స్ కూడా త్వరలోనే ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. గత సీజన్ లాగానే, ఈ సీజన్ లో కూడా అగ్నిపరీక్ష షో ద్వారా సామాన్యులను ఎంచుకోనున్నారు.
గత సీజన్ లో సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ పడాలా టైటిల్ విన్నర్ గా నిలబడగా, డిమోన్ పవన్ టాప్ 3 గా నిలిచారు. అదే విధంగా దివ్య నిఖిత, హరిత హరీష్ వంటి సామాన్యులు షోపై బలమైన ప్రభావం చూపించారు. అందుకే ఈసారి ‘అగ్నిపరీక్ష 2’ కి లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావొచ్చు. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ఈసారి ‘బిగ్ బాస్ 10’ స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యే అవకాశం లేదని, జీ తెలుగు ఛానల్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని, ఒక ప్రచారం మొదలు పెట్టారు. ఎందుకంటే ‘ఎండోమెల్ షైన్’ సంస్థ స్టార్ మా ఛానల్ తో చేసుకున్న ఒప్పందం గడువు అయిపోయిందని, అందుకే ఈసారి జీ తెలుగు ఛానల్ కి షిఫ్ట్ అయ్యేందుకు చూస్తున్నారని అంటున్నారు.
ఈ రూమర్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం తో బిగ్ బాస్ సన్నిహిత వర్గాలు రెస్పాన్స్ ఇస్తూ, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, బిగ్ బాస్ సీజన్ 8 సమయం లోనే ‘ఎండమోల్ షైన్’ సంస్థ తో స్టార్ మా చేసుకున్న ఒప్పందం ముగిసిందని, కానీ ఆ తర్వాత వెంటనే సరికొత్త ఒప్పందం తో బిగ్ బాస్ సీజన్ 12 వరకు గడువు ని పొడిగించుకున్నారని. కాబట్టి ఈ సీజన్ కూడా స్టార్ మా ఛానల్ లోనే ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా ఈ సీజన్ నుండి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడు అనే రూమర్ కూడా ప్రచారం అయ్యింది. ఇందులో కూడా ఎలాంటి నిజం లేదట. బిగ్ బాస్ 12 వరకు నాగార్జున తో ఒప్పంద ఉందని అంటున్నారు.