Ram Charan Anne Master Rare Pics
Ram Charan: రామ్ చరణ్ పక్కన నిల్చున్న ఈ అమ్మాయి బిగ్ బాస్ కంటెస్టెంట్. ప్రముఖ కొరియోగ్రాఫర్. మోస్ట్ పాప్యులర్ షో ఢీ కి జడ్జిగా కూడా చేశారు. అలాగే వందకు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఇప్పటికే ఆమె ఎవరో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. అవును మీ అంచనా నిజమే.. అనీ మాస్టర్. ఈమె అసలు పేరు అనిత లంబ. అనీ మాస్టర్ గా పాప్యులర్. అనీ మాస్టర్ స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసింది.
ఐదేళ్ల ప్రాయంలోనే అనీ మాస్టర్ ఫాదర్ మరణించాడట. అనీ మాస్టర్ కేవలం 10వ తరగతి చదివింది. తర్వాత చదువు ఆపేసి డాన్స్ ని కెరీర్ గా ఎంచుకుందట. బెంగాల్ నుండి ఆమె ఫ్యామిలీ హైదరాబాద్ కి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రానికి మొదటిసారి కొరియోగ్రఫీ చేసిందట. తక్కువ వయసులోనే వందకు పైగా చిత్రాలకు అనీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
రామ్ చరణ్ చిత్రాలకు కూడా ఆమె డాన్స్ కంపోజ్ చేశారు. ఆ సమయంలో చరణ్ తో ఒక ఫోటో దిగారు. రామ్ చరణ్-తమన్నా హీరో హీరోయిన్ గా నటించిన రచ్చ చిత్రానికి అనీ మాస్టర్ పని చేశారు. ఢీ జోడి జడ్జిగా ఆమె వ్యవహరించడం జరిగింది. ఢీ తెలుగులో అత్యంత పాప్యులర్ డాన్స్ రియాలిటీ షోగా ఉంది. పలు బుల్లితెర షోలలో కూడా ఆమె సందడి చేసింది.
బిగ్ బాస్ సీజన్ 5లో అనీ మాస్టర్ పాల్గొనడం విశేషం. అనీ మాస్టర్ హౌస్లో సత్తా చాటింది. ఆమె ముక్కుసూటిగా ఉండేవారు. కొంచెం కోపం కూడా ఎక్కువే. అనీ మాస్టర్ 11 వారాలు హౌస్లో ఉంది. 77వ రోజు ఎలిమినేట్ అయ్యింది. అనీ మాస్టర్ కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఆమె వ్యక్తిగత సమాచారం గురించి తెలిసింది తక్కువే.
Web Title: Ram charan anne master rare pic goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com