67th Filmfare Awards 2022: ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఫిలిం ఫేర్ అవార్డ్స్ నిన్న 67 వ ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ ని ఘనంగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా అట్టహాసం తో ఎంతో ఘనంగా జరిగింది..ఈ వేడుకకు సౌత్ ఇండియన్ బడా సూపర్ స్టార్స్ అందరూ హాజరయ్యారు..ఇక గత ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కి ఎక్కువ కేటగిరీలలో అవార్డులు వచ్చాయి..ఉత్తమ నటుడు గా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్,ఉత్తమ చిత్రం,ఉత్తమ గాయకుడిగా సిద్ది శ్రీరామ్(శ్రీవల్లి సాంగ్ ), యూత్తమ్మా ప్లే బ్యాక్ సింగర్ గా ఇంద్రావతి చౌహాన్ (ఊ అంటావా మామ సాంగ్), బెస్ట్ సినిమాటోగ్రఫీ మిర్లూస్లా కూబా బ్రజాక్ (పుష్ప) ఇలా అత్యధిక కేటగిరీలలో పుష్ప సినిమా క్లీన్ స్వీప్ చేసింది..ఇక ఉత్తమనటిగా ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాకి గాను అందుకుంది.

పుష్ప సినిమాతో పాటుగా అల్లు అర్జున్ హీరో గా నటించిన ఆలా వైకుంఠపురం లో సినిమాకి కూడా మూడు కాటగిరీలలో అవార్డులు వచ్చాయి..ఉత్తమ సహాయ నటుడిగా మురళి శర్మ కి, ఉత్తమ సహాయనటిగా టబు గారికి, ఉత్తమ కొరియోగ్రాఫేర్ గా శేఖర్ మాస్టర్ కి అలవైకుంటపురంలో సినిమా ద్వారా అవార్డులు వచ్చాయి..ఇక మిగిలిన కాటగిరీలలో ఉప్పెన మరియు శ్యామ్ సింగరాయ్ సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి..ఉప్పెన సినిమా ద్వారా బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డును పంజా వైష్ణవ్ తేజ్,బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును కృతి శెట్టి కైవసం చేసుకున్నారు.

ఇక క్రిటిక్స్ క్యాటగిరి లో సాయి పల్లవి మరియి న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాకి గాను ఉత్తమ నటీనటుల అవార్డులను కైవసం చేసుకున్నారు..ఇక ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు ని ఇచ్చారు..ఈ అవార్డుని ఈసారి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారికి ఇచ్చారు..ఈ అవార్డులలో ఎక్కువ శాతం మన తెలుగు నుండి అల్లు అర్జున్ సినిమాలే ఉండడం విశేషం.