Ram Charan And Upasana: ఈ సంవత్సరం లో జనవరి 31 ని మెగా అభిమానులు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేరు. ఆరోజు ఫ్యాన్స్ ఆనందంతో పిచ్చోళ్ళు అయిపోతారని మెగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రామ్ చరణ్(Global star Ram Charan), ఉపాసన(Upasana Konidela) త్వరలోనే కవల పిల్లలకు జన్మని ఇవ్వబోతున్నారు అనే వార్తలను గత కొన్ని రోజులుగా మనం వింటూ వస్తున్నాం. ఉపాసన కి గత ఏడాది దీపావళి పండుగ రోజున సీమంతం కూడా చేశారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ఈ దంపతులిద్దరూ క్లిన్ కారా కి జన్మనిచ్చినందుకు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు వారసులు ఈ నెల 31న ఉపాసన కి జన్మించబోతున్నారు. కొడుకులు పుట్టబోతున్నారా?, లేదా కూతుర్లు పుట్టబోతున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటికే రామ్ చరణ్ కి కూతురు ఉంది కాబట్టి, కొడుకులు పుడితే బాగుండును అని మెగా ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి, సురేఖ దంపతులు కూడా కోరుకుంటున్నారు.
రామ్ చరణ్ గతంలో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ టాక్ షోకి సురేఖ, అంజనమ్మ రామ్ చరణ్ కి ఒక స్పెషల్ వీడియో బైట్ ని పంపిస్తారు. అందులో వీళ్లిద్దరు తమకు వారసుడు కావాలని రామ్ చరణ్ ని కోరుతారు. అప్పుడు రామ్ చరణ్ సంతోషంతో ఓకే అని చెప్తాడు. ఈ వీడియో చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించింది. మరి ఇది రామ్ చరణ్ నిజం చేయబోతున్నాడా లేదా అనేది తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే. ఇదంతా పక్కన పెడితే మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు సెలబ్రిటీల్లో కవల పిల్లలకు జన్మని ఇచ్చిన వాళ్ళను చూడలేదు. ఆ విధంగా రామ్ చరణ్, ఉపాసనా దంపతులు టాలీవుడ్ లో కవలపిల్లలకు జన్మని ఇచ్చిన మొట్టమొదటి జంటగా నిలబడబోతుంది.
ఈ నెలలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. 300 కోట్ల రూపాయిల గ్రాస్ కి అతి చేరువలో ఉన్న ఈ చిత్రం, ఇప్పటికే ప్రాంతీయ బాషా చిత్రాల క్యాటగిరీ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న మెగా ఫ్యాన్స్ కి ఇప్పుడు ఈ వార్త రెట్టింపు ఉత్సాహానికి గురి చేసింది. మెగా ఫ్యామిలీ లో పవన్ కళ్యాణ్ ఓజీ తో హిట్ కొట్టడం , ఆ తర్వాత వెంటనే చిరంజీవి కూడా ఇండస్ట్రీ ని షేక్ చేసే బ్లాక్ బస్టర్ ని అందుకోవడం, ఇప్పుడు రామ్ చరణ్ కి కవలపిల్లలు పుట్టడం వంటివి చూస్తుంటే మెగా ఫ్యామిలీ గోల్డెన్ డేస్ మొదలు అయ్యాయి అనేది తెలుస్తోంది.