Yogi Adityanath : యోగి ఆధిత్యనాత్.. ఈ పేరు చెప్పగానే కొంతమంది ఆయన అల్ట్రా హిందుత్వవాదిలాగా.. కేవలం మతవాదిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యోగి పాలన చూస్తే అద్భుతం అని చెప్పొచ్చు. మతవాదంతో ప్రజల మన్ననలు ఎవరూ పొందరు. అభివృద్ధితో ప్రజల మెప్పును యోగి పొందారు. యోగీ రాకముందు యూపీ అంటే బీమారు రాష్ట్రం.. ఉత్తరప్రదేశ్ అంటే ఒక మాఫియాలు ఏలే రాష్ట్రం. కరెంట్ బిల్లులు చెల్లించరు. అసలు ఎక్కువ టైం కరెంట్ ఉండదు. స్కూల్లు అద్వాన్నంగా ఉంటాయి. స్కూళ్లు కాలేజీల్లో కాపీ కొడుతుంటారు. 2017 యోగి వచ్చాక 8 సంవత్సరాల్లో ఎలా మార్పు తీసుకొచ్చారు. ఆ మార్పు అధికార గణాంకాలు చెబుతున్నాయి..
ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. మొత్తం దేశంలో జీఎస్.డీపీలో టాప్ 3లో ఉత్తరప్రదేశ్ ఉంది. తమిళనాడుకు కొంచెం తక్కువ ఉంది. ఇది కేవలం యోగి వల్లనే సాధ్యమైంది. క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ లో అభివృద్ధి చూస్తే.. యూపీ దేశంలో నే 1.14 లక్షల కోట్లతో అగ్రగామిగా నిలిచింది.
ఎంఎస్ఎంఈలో దేశంలోనే టాప్ గా నిలిచింది.వరి, గోధుమ, కాయగూరలు, పాలు, చెరకులో నంబర్ 1గా యూపీ నిలిచింది. పండ్ల ఉత్పత్తిలో 3వదిగా నిలిచింది. దేశీయ యాత్రికులు వెళ్లే రాష్ట్రం 137 కోట్ల యాత్రికులతో టాప్ గా నిలిచింది. వ్యవసాయ అభివృద్ధి రేటు 17 శాతంగా ఉంది. మొత్తం ఆహార ధాన్యాల్లో 21 శాతం దేశంలో యూపీనే పండిస్తోంది. పేదరికం నుంచి 6 కోట్ల మందిని యోగి బయటకు తీసుకొచ్చారు.
బీమారు నుంచి టాప్ 3రాష్ట్రంగా గా మారిన యు.పి.. ఇది ఎలా సాధ్యమైందంటే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
