RRR Movie: దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఎంతో ఆతృతగా ఎదురుచూసేలా చేస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు, పాటలు నెట్టింట ట్రెండింగ్ గా నిలిచాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా.. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. అయితే రిలీజ్ కి ముందే ఆర్ఆర్ఆర్ సినిమా వివాదాల్లో నలుగుతోంది. కొమురం భీం క్యారెక్టర్ పై గతంలో ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది.
మరోవైపు కరోనా కారణంగా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది. ఈ సంక్రాంతికి జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా తెలిపింది. ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో షాక్ తగిలింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను వక్రీకరించారని తెలంగాణ హైకోర్ట్ లో పిల్ దాఖలైంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దని, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషన్ దారు హైకోర్ట్ ను కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యం రాగా… ప్రజాప్రయోజన వ్యాజ్యం కావడంతో సీజే ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ram charan and tharak rrr movie facing issues about characters
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com