Rashmika Mandanna
Rashmika : బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కి కొత్త ఊపిరి పోసిన లేటెస్ట్ చిత్రం ‘చావా'(Chhaava Movie). గడిచిన కొన్నేళ్ల నుండి సౌత్ ఇండియన్ సినిమాల డామినేషన్ ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోతూ వచ్చాయి. ఖాన్స్ కూడా సినిమాలు చేయడం తగ్గించేశారు. అలాంటి సమయంలో విక్కీ కౌశల్ రూపం లో మరోసారి బాలీవుడ్ పూర్వ వైభవాన్ని చూస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఒక వీరోచిత కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఉన్నాడని,, అతను హిందువుల కోసం పోరాటం చేసి వీర మరణం పొందాడనే విషయం నేటి తరం యువతకు తెలియదు. అలా మన హిస్టరీ ని తెలియచేస్తూ తీసిన సినిమా కావడంతో మొదటి నుండి ఈ చిత్రంపై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉండేవి. ఇక విడుదలైన తర్వాత అంచనాలకు మించి సినిమా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డుల సునామీని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.
సోమవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి 30 కోట్ల రూపాయిల రేంజ్ లో నెట్ వసూళ్లు వచ్చాయంటే, హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఇదే ఊపులో ఈ సినిమా ముందుకు పోతే 500 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయట. ఈ చిత్రంలో హీరోగా నటించిన విక్కీ కౌశల్(Vicky Kaushal) తో పాటు హీరోయిన్ గా నటించిన రష్మిక(Rashmika Mandanna) కి కూడా మంచి పేరొచ్చింది. రష్మిక అదృష్టం ప్రస్తుతం బాలీవుడ్ లో మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ‘పుష్ప'(Pushpa) చిత్రం అక్కడ పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకు ‘యానిమల్'(Animal Movie)’ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా బాలీవుడ్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘పుష్ప 2 ‘ తో ఆమె మరోసారి ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకొని బాలీవుడ్ ఆడియన్స్ లో శాశ్వత ముద్ర వేసుకుంది.
ఇప్పుడు రీసెంట్ గా ‘చావా’ తో మరో ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని అందుకున్న రష్మిక మందాన, బాలీవుడ్ నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ‘చావా’ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు గాను ఆమెకి నిర్మాతలు 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోయిన్స్ బాలీవుడ్ లో రష్మిక తప్ప మరొకరు ప్రస్తుతం లేరు. అందుకే ఆమె ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న ‘సికందర్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో కూడా ఆమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఈ చిత్రంపై కూడా బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.