https://oktelugu.com/

Viral: కాంగ్రెస్ నేతను ఆడుకున్నారు.. వైరల్ ఫొటోలు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ గురించి తెలియని వారుండరు. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా ఈయన పనిచేశారు. అంతర్జాతీయ వ్యవహారాలు, దేశీయ రాజకీయాల్లో చాలా పరిజ్ఞానం గల నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల తన సొంత రాష్ట్రం తిరువనంతపురంలో ఒక దేవాలయంలో సంప్రదాయ రీతిలో 10 కొబ్బరికాయలు గట్టిగా గుడి ముందు నేలకోసి కొట్టారు. ఆ ఫొటోలను ఎవరో తీయగా.. తాజాగా సృజనశీలురైన కొందరు నెటిజన్లు శశిథరూర్ ఫోటొలతో ఫన్నీ మీమ్స్ చేసి అలరించారు. […]

Written By: , Updated On : August 26, 2021 / 08:05 PM IST
Follow us on

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ గురించి తెలియని వారుండరు. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా ఈయన పనిచేశారు. అంతర్జాతీయ వ్యవహారాలు, దేశీయ రాజకీయాల్లో చాలా పరిజ్ఞానం గల నేతగా పేరు తెచ్చుకున్నారు.

అయితే ఇటీవల తన సొంత రాష్ట్రం తిరువనంతపురంలో ఒక దేవాలయంలో సంప్రదాయ రీతిలో 10 కొబ్బరికాయలు గట్టిగా గుడి ముందు నేలకోసి కొట్టారు. ఆ ఫొటోలను ఎవరో తీయగా.. తాజాగా సృజనశీలురైన కొందరు నెటిజన్లు శశిథరూర్ ఫోటొలతో ఫన్నీ మీమ్స్ చేసి అలరించారు.

శశిథరూర్ ఒక టీకొట్టులో చాయ్ పోస్తున్నట్టు.. అలాగే ఒక బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థిని కొబ్బరికాయతో చావబాదుతున్నట్టు.. ఇక ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పిచ్ పై కొబ్బరికాయతో కొడుతున్నట్టు.. ఒక సంప్రదాయ నృత్యం చేస్తున్న యువతులతో పదం కలిపినట్టు ఇలా విభిన్నంగా మీమ్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయనకు ట్యాగ్ చేశారు.

వీటిని చూసి శశిథరూర్ ఫిదా అయిపోయారు. వీటిని ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసి స్పందించాడు. ఇంత చిలిపిగా తన ఫొటోలను ఎవరు ఎడిట్ చేశారో తెలియదు కానీ.. ఈ ఫొటోలు నాకు బాగా నచ్చాయని ఆయన నవ్వుకోవడం విశేషం.