https://oktelugu.com/

Upasana Seemantha ceremony : ఉపాసన సీమంత వేడుకలో రామ్ చరణ్-అల్లు అర్జున్ అల్లరి…

ఆ వీడియోలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. పక్కనే ఉన్న ఉపాసన గట్టిగా నవ్వేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2023 / 08:34 PM IST
    Follow us on

    Upasana Seemantha ceremony : హైదరాబాద్ లో ఉపాసన సీమంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. సానియా మీర్జా, మంచు లక్ష్మీ సైతం సందడి చేశారు. అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రామ్ చరణ్ తో అల్లు అర్జున్ కి గ్యాప్ వచ్చిందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన రాక చర్చకు దారితీసింది. అదే సమయంలో మెగా హీరోల మధ్య విబేధాలు కేవలం అపోహలే అని తేలిపోయింది. అలాగే ఉపాసన సీమంత వేడుకలో రామ్ చరణ్-ఉపాసన చాలా సరదాగా గడిపారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

    ఆ వీడియోలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. పక్కనే ఉన్న ఉపాసన గట్టిగా నవ్వేసింది. అనంతరం ఉపాసనతో ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. హ్యాపీ ఫర్ యు స్వీటెస్ట్ ఉప్సి అని కామెంట్ పెట్టారు. ఉపాసన సీమంత వేడుకలో చరణ్, అల్లు అర్జున్ ల అనుబంధం మరోసారి బయటపెట్టింది. ఇక జులై నెలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. వైద్యులు డెలివరీ డేట్ కూడా ఇచ్చారట. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా వెల్లడించారు.

    ఉపాసనకు పుట్టబోయేది అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. ఇక బిడ్డ కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఉపాసనకు డెలివరీ అయ్యేవరకు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనరట. కీలక సమయంలో ఉపాసన పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. ఈ క్రమంలో కనీసం ఆరు నెలల వరకు రామ్ చరణ్ ఎలాంటి షూటింగ్స్ చేయరు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

    2012లో ఉపాసన-రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. పదేళ్ల అనంతరం ఉపాసన తల్లయ్యారు. అందుకే మెగా ఫ్యామిలీకి, అభిమానులకు ఇది చాలా స్పెషల్ మూమెంట్. అలాగే ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ వచ్చింది. అంటే వరుస పండుగలు రామ్ చరణ్ కుటుంబంలో చోటు చేసుకున్నాయి. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే ఉప్పెన బుచ్చిబాబుతో ఒక చిత్రం ప్రకటించారు.