Artist Surekha Vani : మంచో చెడో చేసి నలుగురిలో నలగాలి. జనాలు మాట్లాడుకునేలా చేయాలి. లేదంటే సెలబ్రెటీలకు కెరీర్ ఉండదు. ఫార్మ్ లో ఉన్నవాళ్లకు ఆటోమేటిక్ గా ప్రచారం దక్కుతుంది. వెలుగు కోల్పోయే దశలో ఉన్నోళ్లు ఏదో ఒక విధంగా జనాల దృష్టిని ఆకర్షించాలి. నటి సురేఖా వాణి అదే చేస్తున్నారు. ఒకప్పుడు సురేఖా వాణి బిజీ యాక్ట్రెస్. పరిస్థితులు మారాయి. కొత్త సరుకు రావడం. సినిమాల కంటెంట్ మారడంతో సురేఖా వాణికి ఆఫర్స్ రావడం లేదు. సురేఖా వాణి లేడీ కమెడియన్ పాత్రలకు ఫేమస్. కొన్ని చిత్రాల్లో అక్కా, వదినలు పాత్రలు కూడా చేశారు.
చెప్పాలంటే దర్శకుడు శ్రీను వైట్ల ఆమెను ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో సురేఖా వాణి చేసిన పాత్రలు పేరు తెచ్చాయి. రెడీ, నమో వెంకటేశా, బాద్ షా చిత్రాల్లో సురేఖా వాణి కామెడీ అద్భుతంగా ఉంటుంది. సురేఖా వాణి భర్త మరణించాక స్లో అయ్యారు. 2019లో సురేష్ తేజ అనారోగ్యంతో కన్నుమూశారు. భర్త మరణం నేపథ్యంలో కొన్నాళ్ళు సురేఖా వాణి చిత్రాలు చేయలేదు. 2020-2021 లాక్ డౌన్ నడిచింది. చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది. 2022 నుండి పరిశ్రమ పూర్వ స్థితికి చేరింది.
అయితే మేకర్స్ సురేఖా వాణిని పట్టించుకోవడం మానేశారు. దీంతో సురేఖా వాణి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. గ్లామరస్ ఫోటో షూట్స్, హాట్ వీడియోలతో నెటిజెన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఇటీవల ఆమె ఓ బోల్డ్ వీడియో షేర్ చేశారు. రొమాంటిక్ సాంగ్ కి స్టెప్స్ వేస్తూ కట్టిపడేసారు. నడుము నాభి కనిపించేలా సురేఖా వాణి చీర కట్టులో డాన్స్ చేయడం వైరల్ గా మారింది. నెటిజెన్స్ ఆమె గ్లామర్ పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా సురేఖా వాణి తన కూతురు సుప్రీతను వెలుగులోకి తీసుకొస్తున్నారు. యంగ్ బ్యూటీ సుప్రీత సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో సుప్రీతను లక్షల్లో ఫాలో అవుతున్నారు. బుల్లితెర షోలలో సందడి చేస్తూ పాపులారిటీ అంతకంతకు పెంచుకుంటున్నారు. సుప్రీత హీరోయిన్ ని చేయడమే సురేఖా వాణి లక్ష్యం. మరి సురేఖా వాణి కోరిక ఈ మేరకు నెరవేరుతుందో చూడాలి. సుప్రీత మాత్రం హీరోయిన్ మెటీరియల్. అయితే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు సక్సెస్ కావడం అంత సులభం కాదు…