Rakulpreeth Singh :హీరోయిన్ కావడం అంత సులభం కాదు. వేల మంది పోటీపడే పరిశ్రమలో అవకాశాలు వచ్చేది ఓ పది మంది అమ్మాయిలకే. అంత టఫ్ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక అవకాశాల కోసం అమ్మాయిల ప్రయాణం అంత్యంత క్లిష్టంగా ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్లు, మోసాలు, వేధింపులను దాటి రావాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్ అయిన ప్రతి అమ్మాయి ఎన్నో కష్టాలు అనుభవిస్తే కానీ ఆ పొజిషన్ కి వెళ్ళలేదు. పంజాబీ అమ్మాయి అయిన రకుల్ ప్రీత్ సైతం ఎవరి సప్పోర్ట్ లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సౌత్ టు నార్త్ ఏలారు.

కాగా తాను పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదురైన అనుభవాలు, అవకాశాల కోసం పడ్డ పాట్లు రకుల్ వెల్లడించారు. రకుల్ సినిమా వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవారట. రోజుకు ఐదు నుండి పది ఆడిషన్స్ ఇచ్చేవారట. బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని రోజంతా దర్శకుల చుట్టూ తిరిగేవారట. ఆ క్రమంలో కారులోనే బట్టలు మార్చుకునేవారట. కాగా ఓ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారట. కొన్ని రోజులు షూటింగ్ చేశాక తనను తప్పించి వేరే హీరోయిన్ ని తెచ్చారట.
అందుకు నేను బాధపడలేదు. కష్టపడకుండా ఏది దక్కదు. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించాను అని రకుల్ చెప్పుకొచ్చారు. రకుల్ లేటెస్ట్ మూవీ ఛత్రీవాలీ జీ 5లో జనవరి 20 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇది సెక్స్ ఎడ్యుకేషన్ తో కూడిన రొమాంటిక్ కామెడీ చిత్రం. ఛత్రీవాలీ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. గత ఏడాది వరుసగా నాలుగైదు హిందీ చిత్రాలు ఆమె నుండి విదలయ్యాయి. ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు.
కాగా 2013లో విడుదలైన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రకుల్ ప్రీత్ కి బ్రేక్ ఇచ్చింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన రకుల్ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించారు. టాప్ హీరోయిన్ గా దశాబ్దం పాటు పరిశ్రమలో ఉన్నారు. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయ్యారు. ఆమె వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. కాగా భారతీయుడు 2 మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు.