Site icon OkTelugu

Avoid fights in marriage: భార్యాభర్తలు ఇలా చేస్తే.. వారి మధ్య గొడవలే రావు..

Avoid fights in marriage

Avoid fights in marriage

Avoid fights in marriage: నేటి కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దలు ఒకప్పటి మాదిరిగా ప్రేమ వివాహాలను వ్యతిరేకించడం లేదు. పైగా ప్రేమ వివాహాలను ప్రోత్సహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. చిన్న చిన్న కారణాలతోనే దంపతుల మధ్య విభేదాలు వస్తున్నాయి. అవి కాస్తా విడాకులకు దారి తీస్తున్నాయి. వాస్తవానికి ఆ విభేదాలు రావడానికి ప్రధాన కారణం పడక గదిలో ఎడం పెరగడమేనట..

ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య విడాకులు పెరిగిపోయిన నేపథ్యంలో..ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పలు కీలక విషయాలు వెలుగు చూసాయి. భార్య భర్తలు బలమైన సంబంధాల కోసం ప్రతిరోజు సృష్టికార్యంలో పాల్గొనాలట. భాగస్వాములు సన్నిహితంగా ఉంటేనే వారిలో ఉన్న ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది అంట. శరీరానికి వ్యాయామం లభించడంతో చెడు కొవ్వులు కూడా కరిగిపోతాయట. చర్మం నిత్య నూతనంగా మెరిసిపోతుందట. శరీర అభివృద్ధికి కావలసిన హార్మోన్లు విడుదలవుతాయట.

వాస్తవానికి సృష్టి కార్యంలో పాల్గొంటున్నప్పుడు దంపతుల మధ్య గాఢమైన సాన్నిహిత్యం పెరిగిపోతుందట. ఆ సమయంలో వారు మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం కలుగుతుందట. దాంపత్యంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుందట. అంతేకాదు భాగస్వామి సమక్షంలో.. ప్రైవేట్ గా జరిపే సంభాషణలో లోతైన ప్రేమ ఉంటుందట. ఆ సమయంలో మనసులో ఉన్న ఒత్తిడి మాత్రమే కాకుండా.. సమస్యలు కూడా తెరపైకి వచ్చి ఒక పరిష్కార మార్గానికి దారి చూపుతాయట.

పడక గదిలో సాగించే వ్యవహారాలు చాలా వరకు దంపతుల మధ్య దూరాన్ని తగ్గిస్తాయట. దూరం తగ్గడం వల్ల చాలావరకు విభేదాలు తొలగిపోతాయట. ప్రేమ పెరిగిపోయి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరిగిపోతుందట. అందువల్లే దూరంగా ఉండాలని అనిపించదట. అందువల్లే సాధ్యమైనంతవరకు బెడ్ రూం లో దంపతులు విడిగా కాకుండా.. కలయికలో పాల్గొనాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ వయో భారం.. ఇతర అనారోగ్య సమస్యలు కనుక ఉండి ఉంటే అటువంటివారు వైద్యుల సలహాలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Exit mobile version