https://oktelugu.com/

పవన్‌ సరనన రకుల్‌.. నిజమేనా క్రిష్!

మొన్నటిదాకా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్. సమంత, కాజల్‌తో నంబర్ వన్‌ ప్లేస్‌కు పోటీ పడిందామె. కెరటం అనే చిన్న సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ భామ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మూవీ సక్సెస్‌తో కెరీర్లో ఎక్స్‌ప్రెస్‌ స్పీడుతో దూసుకెళ్లింది. మంచు మనోజ్‌, రామ్, నాగచైతన్య, బెల్లకొండ శ్రీనివాస్‌లతో పాటు రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, గోపీచంద్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించింది. సూపర్ స్టార్ మహేశ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 28, 2020 / 06:31 PM IST
    Follow us on


    మొన్నటిదాకా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్. సమంత, కాజల్‌తో నంబర్ వన్‌ ప్లేస్‌కు పోటీ పడిందామె. కెరటం అనే చిన్న సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ భామ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మూవీ సక్సెస్‌తో కెరీర్లో ఎక్స్‌ప్రెస్‌ స్పీడుతో దూసుకెళ్లింది. మంచు మనోజ్‌, రామ్, నాగచైతన్య, బెల్లకొండ శ్రీనివాస్‌లతో పాటు రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, గోపీచంద్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించింది. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఓవైపు తెలుగు సినిమాలు చేస్తూ తమిళ్‌, హిందీలో కూడా నటిస్తూ బిజీగా మారింది. తమిళ్‌లో సూర్య, కార్తి సరసన నటించి కోలీవుడ్‌కు దగ్గరైంది. మరోవైపు హిందీలో కూడా ఆఫర్లు వస్తుండడంతో క్రమంగా టాలీవుడ్‌కు దూరమైంది. అదే సమయంలో తెలుగులో ఆమె చేసిన చివరి చిత్రం మన్మధుడు 2 డిజాస్టర్గా మారడం కూడా ఆమెను నిరాశ పరిచింది. నాగార్జునతో కలిసి ఆ మూవీలో బోల్డ్‌గా నటించిన రకుల్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినా ఆ మూవీ బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టింది. దాంతో, హిందీ, తమిళ్‌పై దృష్టిసారించిందామె. బాలీవుడ్‌లో అటాక్‌, చలే చలో మూవీస్‌ చేస్తున్న రకుల్‌… కోలీవుడ్‌లో అయలాన్‌, ఇండియన్‌ 2లో నటిస్తోంది. శంకర్, కమల్‌ హాసన్‌ కాంబోలో వస్తున్న ఇండియన్‌2పై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది.

    Also Read: డబ్బులు కోసం హీరోయిన్లందరూ.. !

    తాజా సమాచారం ప్రకారం ఆమె మళ్లీ తెలుగుపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. టాలీవుడ్‌ నుంచి ఓ భారీ ఆఫర్ ఆమెను వరించిందట. ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్‌ వచ్చిందని లేటెస్ట్‌ టాక్‌. ప్రస్తుతం హిందీ సూపర్ హిట్‌ ‘పింక్‌’ మూవీ రీమేక్‌ వకీల్‌ సాబ్‌లో నటిస్తున్నాడు పవన్‌. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ సగం కంటే ఎక్కువే పూర్తయింది. కరోనా కారణంగా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీకి కూడా పవన్‌ సైన్‌ చేశాడు. ఏయమ్ రత్నం నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. మొన్నటిదాకా విరూపాక్ష అనే టైటిల్‌ ప్రచారంలో ఉండగా… ఇప్పుడు గజదొంగ, అనే మరో పేరు తెరపైకి వచ్చింది.

    Also Read: ఒక్క డైలాగ్‌ లేకుండా ఆర్జీవీ.. ‘మర్డర్’ ట్రైలర్

    గమ్యం నుంచి బాలీవుడ్‌లో మణికర్ణిక వరకూ హిట్‌ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న క్రిష్‌.. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌ సిరీస్‌లు నిరాశ పరచడంతో ఈ మూవీ ద్వారా మళ్లీ తన స్టామినా చూపించాలని భావిస్తున్న క్రిష్‌ పక్క స్క్రిప్టు తయారు చేసుకున్నాడట. దాంతో ఈ మూవీలో పవన్‌ సరసన హీరోయిన్‌ ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కంచెలో నటించిన ప్రజ్ఞా జైస్వాల్‌ పేరు వినిపించినప్పటికీ.. పవన్‌ స్టార్డమ్‌కు ఆమె సరితూగదని తేలింది. అలాగే, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ను కూడా అనుకున్నారు. అయితే, ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు తెరపైకి వచ్చింది. సౌత్ ఇండియాలో ఇప్పటికే నిరూపించుకోవడంతో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు ఉండడంతో పవన్‌కు జోడీగా రకుల్‌ అయితే బాగుంటుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. డైరెక్టర్ క్రిష్ కూడా ఇటీవలే రకుల్‌ను కలిసి స్టోరీ చెప్పగా.. ఆమె సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైన టాలీవుడ్‌లో ఓకొత్త కాంబినేషన్‌ అభిమానులను అలరించనుంది. మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌తో కలిసి నటించిన రకుల్‌… ఫస్ట్‌టైమ్‌ పవన్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకోనుంది. అయితే, ఈ విషయాన్ని చిత్ర బృందం ధ్రువీకరించాల్సి ఉంది. డైరెక్టర్ క్రిష్‌ ఏం చెబుతాడో మరి.