కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

తెలంగాణ పీసీసీ చీఫ్ రేసు అనేది ఎండమావిలో నీటి కోసం వెతికే పెద్ద దప్పిక యాత్ర అయిపోయింది. ప్రతీసారి ఎవరిదో ఒకరి పేరు తెరపైకి రావడం.. మళ్లీ ఆ నియామకం వెనక్కి వెళ్లిపోవడం జరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డికి పోటీ లేదని.. ఆయన నియామకం ఖాయం అనుకున్న తర్వాత సడన్ గా ఆ ప్రక్రియ ఆగిపోయింది. రేవంత్ ను సీనియర్లు అంతా కలిసి అడ్డుకున్నారనే చర్చ కాంగ్రెస్ లో సాగుతోంది. అయితే ఇప్పుడు సడన్ గా పీసీసీ […]

Written By: NARESH, Updated On : July 28, 2020 6:04 pm
Follow us on


తెలంగాణ పీసీసీ చీఫ్ రేసు అనేది ఎండమావిలో నీటి కోసం వెతికే పెద్ద దప్పిక యాత్ర అయిపోయింది. ప్రతీసారి ఎవరిదో ఒకరి పేరు తెరపైకి రావడం.. మళ్లీ ఆ నియామకం వెనక్కి వెళ్లిపోవడం జరుగుతూనే ఉంది.

రేవంత్ రెడ్డికి పోటీ లేదని.. ఆయన నియామకం ఖాయం అనుకున్న తర్వాత సడన్ గా ఆ ప్రక్రియ ఆగిపోయింది. రేవంత్ ను సీనియర్లు అంతా కలిసి అడ్డుకున్నారనే చర్చ కాంగ్రెస్ లో సాగుతోంది. అయితే ఇప్పుడు సడన్ గా పీసీసీ చీఫ్ రేసులో పెద్ద జానారెడ్డి గారి పేరు వచ్చిందని ప్రచారం సాగుతోంది. ఆయన నియామకాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఖాయం చేశారని అంటున్నారు.

Also Read: తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవీ దక్కనుందా?

తెలంగాణలో సీనియర్లు సహా ఎవరి ప్రయత్నాల్లో వారు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నప్పటికీ తెలంగాణకు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడంలో అధిష్టానం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సహా అనేకమంది తమకు అనుకూలంగా ఒక్క ప్రకటన పొందడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. అధిష్టానం మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవలే బీజేపీ కూడా ఏపీ, తెలంగాణకు కొత్త అధ్యక్షులను మార్చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం కొత్త పీసీసీ ఛీప్ ల నియామకాన్ని ఎందుకు వాయిదా వేస్తోందన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న? ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కాపాడడం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే గోవా, మణిపూర్, కర్ణాటక, తాజాగా మధ్యప్రదేశ్ లోనూ చేజేతులారా అధికారంలో ఉండి మరీ బీజేపీ చేతిలో భంగపాటుకు గురై అధికారం కోల్పోయింది. ప్రస్తుతం రాజస్థాన్ లో పార్టీ అస్థిరమైన స్థితిలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం కూలే స్థితిలో ఉంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్.. సొంత పార్టీ సీఎంపై తిరుగుబాటు చేశారు. దీంతో రాజస్థాన్ బీజేపీ పరం కాకుండా కాంగ్రెస్ అధిష్టానం తన శక్తియుక్తులన్నీ రాజస్థాన్ ప్రభుత్వాన్ని కాపాడడంపైనే దృష్టి కేంద్రీకరించింది.

Also Read: కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

కాబట్టి తెలంగాణకు చెందిన కొందరు నాయకులు హైకమాండ్ కు పీసీసీ చీఫ్ మార్పు గురించి సంప్రదించినప్పటికీ.. ఈ టైంలో తమకు సమయం లేదని వారిని తిప్పి కొడుతున్నారు. రాజస్థాన్ లో సమస్యను పరిష్కరించాలని మాత్రమే కోరుకుంటున్నారు. అప్పటివరకు తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరిగేలా కనిపించడం లేదు.

-ఎన్నం