https://oktelugu.com/

Rakul Preeth Sing : వామ్మో.. రకుల్ ప్రీత్ సింగ్ దంపతులకు అన్నికోట్ల ఆస్తులా?

రకుల్ ఆస్తుల గురించి తీవ్ర చర్చ సాగుతోంది. ఆమె సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకుఎంత సంపాదించారు?ఏమేం కొనుగోలు చేశారు? అనేది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2024 / 11:54 AM IST

    Rakul Preeth sing

    Follow us on

    Rakul Preeth Sing :ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సైతం పెళ్లి పీటలెక్కింది. కొన్ని రోజులుగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తో ప్రేమాయణం సాగించిన ఆమె ఫిబ్రవరి 21న ఈ కో ఫ్రెండ్లీ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.ఇదే సమయంలో రకుల్ ఆస్తుల గురించి తీవ్ర చర్చ సాగుతోంది. ఆమె సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకుఎంత సంపాదించారు?ఏమేం కొనుగోలు చేశారు? అనేది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎన్నికోట్లకు అధిపతో తెలుసుకుందాం..

    రకుల్ ప్రీత్ సింగ్ చదువు పూర్తి చేసిన తరువాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. ఆ తరువాత హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితేకొన్ని రోజులు పాటు ఆమె అక్కడే ఉన్నకలిసి రాలేదు. ఇదే సమయంలో తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వచ్చాయ. ఆ తరువాత తెలుగు స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. చివరగా రకుల్ ప్రీత్ సింగ్ ‘కొండపొలం’ సినిమాలో నటించింది. ఆ తరువాత మరోసారి తెరపై కనిపించలేదు.

    సినిమాల్లో నటించకపోయినా వెబ్ సిరీసుల్లో రకుల్ ప్రీత్ సింగ్ అవకాశాలను తెచ్చుకుంటోంది. ఈమె హిందీలో ‘ఛత్రీవాలి’ అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ ఆ మధ్య ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించింది. ఇందులో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో కనిపించింది. అయితే ఆ తరువాత ఎక్కువగా తెరపై కనపించడం లేదు. ఇంతలో రకుల్ ప్రీత్ సింగ్ వివాహం జరిగిన నేపథ్యంలో ఆమె ఆస్తుల గురించి చర్చ సాగుతోంది.

    రకుల్ ప్రీత్ సింగ్ కు హైదరాబాద్, విశాఖ పట్నంలో మూడు వర్కౌట్ సెంటర్లు ఉన్నాయి. ఓ మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది. దీని విలువ కోటి ఉంటుంది. రూ.70 లక్షల రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు. రూ.75 లక్షల బీఎం డబ్ల్యూ, రూ.35 లక్షల ఆడీ కారు ఉన్నాయి. వీటితో పాటు స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తంగా రూ.50 కోట్లవరకు రకుల్ ప్రీత్ సింగ్ పేరిట ఆస్తులు ఉన్నట్లు సమాచారం. పెళ్లి తరువాత రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో నటిస్తానని చెప్పింది.