https://oktelugu.com/

Rakul Preet Singh : భర్తతో విడాకుల దిశగా రకుల్ ప్రీత్ సింగ్..? వేణుస్వామి చెప్పిందే నిజం అయ్యేట్టు ఉందిగా!

ఇక భర్త జాకీ భగ్నాన్ని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. ఈ సినిమా కారణంగా జాకీ 150 కోట్ల రూపాయిల వరకు అప్పుల పాలయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 17, 2024 / 08:44 PM IST

    Rakul Preet Singh

    Follow us on

    Rakul Preet Singh : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ లీగ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ అనే తెలుగు చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈమె, ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ సక్సెస్ ని మాత్రమే అందుకోలేకపోయింది.ఆ సమయంలో ఆమె తెలుగులో సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి చూస్తూ ఉండగానే సౌత్ లోనే పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

    కానీ ఏ హీరోయిన్ కి అయినా హిట్స్ ఉన్నంత కాలమే అవకాశాలు వస్తాయి. రెండు ఫ్లాప్స్ పడగానే అవకాశాలు తగ్గిపోతాయి. రకుల్ ప్రీత్ కి అలా ఒకటి, రెండు కాదు, చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో ఆమెకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. రీసెంట్ గా విడుదలైన ఇండియన్ 2 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరో సిద్దార్థ్ కి జోడిగా నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా హిట్ అయ్యుంటే మళ్ళీ రకుల్ ప్రీత్ కి అవకాశాలు మళ్ళీ పెరిగేవేమో. కానీ ఈ సినిమా కూడా ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. ఇదంతా పక్కన పెడితే రకుల్ వ్యక్తిగత జీవితం కూడా అనుకున్న స్థాయిలో లేదు. ఆమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ రీసెంట్ గానే డ్రగ్స్ కేసు లో అరెస్ట్ అయ్యాడు. ఇక భర్త జాకీ భగ్నాన్ని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. ఈ సినిమా కారణంగా జాకీ 150 కోట్ల రూపాయిల వరకు అప్పుల పాలయ్యాడు.

    అందువల్ల ఆయన కంపెనీ లో పని చేసే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయం లో రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యనే హైదరాబాద్ లో గ్రాండ్ లాంచ్ చేసిన రెస్టారంట్ కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది. ఇలా అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగతంగా ఆమెకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. మరో పక్క ఈ ఒత్తిడి కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త తో రోజు గొడవలు పడుతుందట. ఇలాగే కొనసాగితే వేణు స్వామి చెప్పినట్టు రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో విడాకులు తీసుకునే ప్రమాదం ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు కానీ, హిందీ సినిమాలు మాత్రం ఉన్నాయి.