Mr Bachchan : సోషల్ మీడియా లో ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ పై ఏ రేంజ్ లో నెగిటివిటీ నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాము. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం విడుదలకు ముందు మీడియా ప్రతినిధులపై విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారిన హరీష్ శంకర్, ఇప్పుడు విడుదల తర్వాత ఆయన విమర్శించిన మీడియా ప్రతినిధుల చేత దారుణమైన విమర్శలను ఎదురుకుంటున్నాడు. కేవలం హీరోయిన్ నడుము చూపించి, పాటలతో చిత్రాన్ని సూపర్ హిట్ చేద్దామనే ఆలోచనతో మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని చేసారు కానీ, ఆ సినిమాని హిట్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో హరీష్ శంకర్ అసలు పని చెయ్యలేదని ఈ సినిమాని చూసిన విశ్లేషకులు చెప్తున్న మాట. అంతే కాదు ఈ సినిమా ద్వారా ఆయన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ‘గురూజీ’ అనే పాత్ర ద్వారా అనేక సార్లు త్రివిక్రమ్ పై పంచులు, సెటైర్లు వేసాడు.
అయితే ఆ సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు ‘ఇది నేరుగా పవన్ కళ్యాణ్ మీద చూపించలేని కోపం, త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చూపించాడని’ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ తో హరీష్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం చేస్తున్నాడు. అలాంటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపాన్ని త్రివిక్రమ్ మీద చూపించడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నాం..పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ ఖరారు అయ్యి ఐదేళ్లు కావొస్తుంది. 2018 వ సంవత్సరం లోనే వీళ్లిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతుంది అని అధికారిక ప్రకటన చేసారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ ప్రాజెక్ట్ పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’ అని ప్రకటించారు. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ పవన్ కి ఫస్ట్ హాఫ్ నచ్చింది కానీ , సెకండ్ హాఫ్ నచ్చలేదు. మార్పులు చేసుకొని రమ్మని హరీష్ శంకర్ కి చెప్పడం ఆయన కొంతకాలం బాగా స్టడీ చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ ని వినిపించాడు. ఇది పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది.
ఇదంతా పక్కన పెడితే 2020 లో ప్రారంభం అవుతుంది అనుకున్న ఈ సినిమాకి బదులుగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి ‘వకీల్ సాబ్’ చిత్రం చెయ్యమని చెప్పాడు. పవన్ అందుకు ఒప్పుకొని చేసాడు. కనీసం ఈ సినిమా తర్వాత అయిన ప్రారంభం అవుతుంది అనుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ తో మరో రెండు రీమేక్ సినిమాలు చేయించాడు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీనికి మొత్తం త్రివిక్రమ్ కారణం కాబట్టి, ఆయన్ని నమ్మి పవన్ తనని పక్కన పెట్టాడు కాబట్టి, ఇద్దరి మీదున్న కోపాన్ని ఈ సినిమాలో ఒకేసారి చూపించాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు.