Rakul Preet Singh: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). కెరటం అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో భారీ హిట్ ని అందుకొని, ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆమె ట్రెండింగ్ లో ఉన్న యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించడమే కాకుండా, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈమధ్య కాలం లో ఈమె తెలుగు సినిమాల్లో అసలు కనిపించడం లేదు. ఆమె మన తెలుగు ఆడియన్స్ కి కనిపించిన చివరి చిత్రం ‘కొండపొలం’. కమర్షియల్ గా ఈ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పై డర్’ చిత్రం పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. ఆమె మాట్లాడుతూ ‘నేను రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసాను. అవి కమర్షియల్ గా మంచి హిట్స్ అయ్యాయి. కానీ మహేష్ బాబు తో చేసిన ‘స్పైడర్’ చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల నా కెరీర్ పై తీవ్రమైన ప్రభావం చూపించింది. అప్పటి నుండే నా కెరీర్ కాస్త గాడి తప్పింది’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. స్పైడర్ చిత్రం తర్వాత తెలుగులో ఈమె ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘మన్మధుడు 2’, ‘చెక్’ , ‘కొండపొలం’ వంటి చిత్రాలు చేసింది. ఈ నాలుగు సినిమాలు కూడా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయింది.
రీసెంట్ గానే ఈమె హీరోయిన్ గా నటించిన ‘దే దే ప్యార్ దే 2’ అనే బాలీవుడ్ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా యావరేజ్ రేంజ్ లో ఆడుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘పతి పత్ని ఔర్ వో ధో’ మరియు ‘రామాయణ్’ చిత్రాల్లో నటిస్తోంది. రామాయణ్ లో ఈమె సూర్పనక్క క్యారక్టర్ లో నటిస్తోంది. దీనిపై రకుల్ అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇంత అందాన్ని పెట్టుకొని రాక్షసి క్యారక్టర్ చేయడం ఏంటి?, పైగా అందులో సీత పాత్ర లో సాయి పల్లవి నటిస్తోంది, తన కంటే జూనియర్ గా ఉన్నటువంటి సాయి పల్లవి సినిమాలో రకుల్ విలన్ క్యారక్టర్ చేయడం సరికాదు అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
“#Spyder was my first failure, the first time I felt what it’s like when expectation breaks was with Spyder.
It affects because I did a lot of Telugu films with #RamCharan and #NTR, and there was a series of 8–10 hits.”
– #RakulPreet | #MaheshBabu pic.twitter.com/jy66ELg6DA
— Whynot Cinemas (@whynotcinemass_) November 25, 2025