Rakul preeth: కెరటం సినమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రార్థనగా అందరి మనసులను దోచుకున్న హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. అనంతరం వరుసగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ.. కెరీర్లో ఫుల్ జోష్‌తో దూసుకెళ్లిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు టాలీవుడ్లో టాప్ హీరోలతో జత కడుతూనే.. మరోవైపు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలని అనుకుంటోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు, హిందీ చిత్రాల్లోనూ ఫుల్ బిజీగా గడుపుతోంది రకుల్.
Also Read: సమంత అందుకే అంత ప్రత్యేకం… సక్సెస్ సీక్రెట్ అదే!
కాగా, తాజాగా ఓ మీడియాతో సరదాగా ముచ్చటించిన రకుల్.. తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలైనా చేస్తారా అని అడగ్గా.. సమాధానం చెప్తూ.. నాకు సినిమాలంటే ప్రాణం.. ఎప్పుడూ ఛాలెంజ్ ఉండే పాత్రలే చేయాలని అనుకుంటుంటా.. వాటికోసం ఎంతగానైనా కష్టపడేందుకు సిద్ధం. కానీ, బరువు పెరగడం, తగ్గడం మాత్రం నా వల్లకాని పని.. అది సహజంగా జరగాల్సిన పని కావాలని బరువు పెరిగి, మళ్లీ తగ్గితే శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత నేనే అనారోగ్యం పాలవ్వాల్సి ఉంటుంది. అందుకే ఒకవేళ అలాంటి పాత్రతో ఎవరైనా వచ్చినా.. నేను నిర్మొహమాటంగా కుదరదనే చెప్పేస్తా.. అంటూ చెప్పుకొచ్చింది రకుల్.
ఇటీవలే కొండపొలం సనిమాలో నటించిన రకుల్(Rakul preeth).. అందులో మంచి నటన కనబరిచి అందరి అభిమానాన్ని దక్కించుకుంది. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నవల ఆధారంగా విభిన్న కథాంశంతో రూపొందించారు. ఇటీవలే ఏటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది.
Also Read: త్రివిక్రమ్ కసరత్తులు.. అనన్య పాండేకి అవకాశం !
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rakul preet singh interesting comments about her movie choice and career
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com