Homeఎంటర్టైన్మెంట్Actress Rakul: సినీ ఇండస్ట్రీలో ప్రతిభావంతుల కోసం మరో అవకాశాన్ని కల్పించిన రకుల్..

Actress Rakul: సినీ ఇండస్ట్రీలో ప్రతిభావంతుల కోసం మరో అవకాశాన్ని కల్పించిన రకుల్..

Actress Rakul: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యి… టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుత కాలంలో హీరోలు, హీరోయిన్స్ సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ లో కూడా మక్కువ చూపిస్తున్నారు. సమంత సఖి బిజినెస్ రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ వంటి తదితర రంగాలలో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో రంగంలో అడుగుపెట్టారు పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఈ నటించిన “కొండపొలం” సినిమా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందలేకపోయింది. కానీ ఈ సినిమాలో రకుల్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయని చెప్పాలి. మరోవైపు బాలీవుడ్ లో “థాంక్స్ గాడ్” సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఈమె. వాటితో పాటు పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో  దూసుకుపోతున్నారు ఈ భామ.

actress rakul preeth singh entering into new business

అలానే ప్రస్తుత కాలంలో యాప్ మార్కెటింగ్ కి మంచి ఆదరణ లభిస్తుంది. అదే బాటలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా అడుగులు వేశారు. తన తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఒక యాప్ ను ప్రారంభించారు ఈ అమ్మడు. దాని పేరు ‘స్టారింగ్ యూ’ ఈ యాప్ చిత్ర పరిశ్రమలోని ఔత్సాహిక ప్రతిభావంతుల కోసమే ఈ యాప్ డెవలప్ చేశారు రకుల్. అయితే ఈ ‘స్టారింగ్ యూ’ యాప్ లో ఎక్కడి నుండైనా ఆడిషన్ చేసుకొనే వీలు కల్పిస్తూ ఔత్సాహిక నటీనటులతో పాటు సినిమాల్లో పనిచేయాలనుకొనేవారికి ఉపయోగపడుతుందన్నారు. ఇతర సాంకేతిక నిపుణులు కూడా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. చూడాలి మరి ఈ యాప్ ఎంత మంది ప్రతిభావంతులకు అవకాశం ఇస్తుందో.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular