Rakul Preet Singh: గత ఏడాది డిసెంబర్ 4 న విడుదలైన ధురంధర్(Dhurandhar Movie) చిత్రం ఆ ఏడాది ఇండియా లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ 900 కోట్ల నెట్ మార్కు వైపు పరుగులు తీస్తోంది. ఈ చిత్రం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మేకర్స్ అసలు ఊహించలేదు. విడుదలకు ముందు ఈ చిత్రం పై బోలెడంత నెగిటివిటీ ఉండేది. ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఈ సినిమాకు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయని, భారీ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం, కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ విడుదల రోజు బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాటింగ్ మొదలు పెడితే, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా సారా అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. ఈమె మరెవరో కాదు, తమిళ హీరో విక్రమ్ నటించిన ‘నాన్న’ చిత్రం గుర్తుంది కదూ?, అందులో చిన్నారి గా నటించింది మరెవరో కాదు, ఈమెనే. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సారా అర్జున్ కంటే ముందు రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగారట. కానీ ఆ సమయం లో ఆమె వరుసగా రెండు మూడు హిందీ సినిమాల షూటింగ్స్ తో బిజీ గా ఉండడంతో ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఆఫర్ ని కోల్పోయింది. ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికీ బాధ పడుతూనే ఉందట. కమిట్మెంట్స్ కి లాక్ అయిపోవడం డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని, ఒకవేళ కమిట్మెంట్స్ లేకపోయుంటే కచ్చితంగా ఈ చిత్రం చేసి ఉండేదాడని అంటూ తన సన్నిహిత వర్గాలతో చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ కెరీర్ ప్రస్తుతం ఏ మాత్రం బాగోలేదు. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా స్టార్స్ పక్కన సినిమాలు చేస్తూ పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేసింది. కానీ ఇప్పుడు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల రకుల్ కెరీర్ బాగా డౌన్ అయిపోయింది . ఆమెకు హీరోయిన్ రోల్స్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు భయపడుతున్నారు. సెకండ్ హీరోయిన్ రోల్స్, లేదా నెగిటివ్ క్యారెక్టర్లు అయితే ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో సూర్పనక్క క్యారెక్టర్ చేస్తోంది. సీత పాత్ర చేసే రేంజ్ ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, ఇలా రాక్షసి క్యారెక్టర్ చేయడం పై ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి కి గురయ్యారు. ఒకవేళ రకుల్ ప్రీత్ సింగ్ దురంధర్ చిత్రాన్ని ఒప్పుకొని చేసుంటే ఈరోజు ఆమె కెరీర్ కం బ్యాక్ వేరే లెవెల్ లో ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.