https://oktelugu.com/

Rakul Preet Singh: వాళ్ళ రాజకీయాల వల్ల నేను సినిమా అవకాశాలు కోల్పోయాను అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!

సందీప్ కిషన్ హీరో గా నటించిన 'వేంకటాద్రి ఎక్స్ ప్రెస్' లో హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 04:31 PM IST

    Rakul Preet Singh

    Follow us on

    Rakul Preet Singh: వారసత్వం ద్వారా సినిమా అవకాశాలు సంపాదించే వారు మన టాలీవుడ్ లోనే కాదు, ప్రతీ ఇండస్ట్రీ లో ఉన్నారు. కేవలం ఈ నేపోటిజం కారణంగానే ఎంతోమంది టాలెంటెడ్ అమ్మాయిలు, అబ్బాయిలు హీరో హీరోయిన్స్ కాలేకపోతున్నారు. కానీ ఇలాంటి డామినేషన్ పరిస్థితులలో కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. రకుల్ ప్రీత్ సింగ్ ఆ కోవకు చెందిన అమ్మాయే. ఈమె టాలీవుడ్ లోకి ‘కెరటం’ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లో హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నెపోటిజం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

    ఆమె మాట్లాడుతూ ‘ఏ ఇండస్ట్రీ లో అయినా ఇది చాలా కామన్ సమస్య. నాకు కూడా ఈ నెపోటిజం వల్ల సినిమాల్లో అవకాశాలు చాలావరకు పోయాయి. అలా అవకాశాలు కోల్పోయిన వాటి గురించి నేను ఆలోచించను. ఆ సినిమాలకు నేను కరెక్ట్ కాదేమో అనుకోని వదిలేస్తాను.కానీ ఒకరు ఆపితే ఆగిపోయే రకం కాదు నేను, నన్ను తొక్కాలని చూస్తే ఇంకా పైకి ఎదిగేందుకు ప్రయత్నం చేస్తా. మా నాన్న ఆర్మీ ఆఫీసర్, ఆయన నుండి నేను పోరాట స్ఫూర్తిని నేర్చుకున్నాను, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలను’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

    ఇదంతా పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదురుకుంటుంది. తెలుగులో ఈమె చివరిసారిగా ‘కొండపొలం’ అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఈమె మళ్ళీ మన తెలుగు సినిమాల్లో కనిపించలేదు. రీసెంట్ గానే శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించింది. ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో కలిసి ఒక చిత్రం చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం లో కూడా ఈమె నటిస్తుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతా రాములుగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక్క పాత్రలో కనిపిస్తుంది. కెరీర్ లో మొట్టమొదటి సారి ఆమె ఈ సినిమా ద్వారా నెగటివ్ రోల్ లో కనిపించబోతుంది.