ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలలో డ్రగ్స్ వ్యవహారం ఒక సస్పెన్స్ డ్రామాలా తయారైంది. అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది. అప్పట్లో పోలీసులు కూడా ఓ రేంజ్ లో హడావుడి చేశారు. డ్రగ్స్ మాఫియాని అణిచివేసేలా.. డ్రగ్ అనే డైలాగే లేకుండా చేయాలి అనేలా పోలీసులు షో చేశారు. చివరకు ఏమైంది.. మళ్ళీ రెండేళ్ళ తరువాత డ్రగ్ మాఫియా అంటూ ఇండస్ట్రీలోని ప్రముఖుల పై మళ్ళీ ఆరోపణలు వచ్చాయి. అసలు అప్పట్లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మి లతో పాటు మరికొంతమంది నటులు, ఇతర టెక్నీషియన్స్ మీద పోలీసులు ఎంక్వైరీ చేశారు కదా.. ఆ డ్రగ్ కేసు ఏమైంది ?
Also Read: టాప్ లెస్ లుక్ లో తెలుగు నటి.. అంకుల్ తో ప్రేమ కూడా !
మళ్ళీ తాజాగా సుషాంత్ మృతితో రియా చక్రబోర్తిని విచారిస్తున్న సమయంలో ఈ డ్రగ్ వ్యవహారం మళ్ళీ బయటకు వచ్చింది. ఎప్పటిలాగే సినిమా సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి, ఇంకా వచ్చే అవకాశం ఉంది. మొత్తం 25 మంది పేర్లు రియా చెప్పినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా స్టార్ హీరోయిన్స్ దీపికా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ లతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా డ్రగ్ వ్యవహారంలో ఉన్నారనే ప్రచారం వస్తుండటం అందర్నీ షాక్ గురి చేసిన మాట వాస్తవం. అయితే ఈ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం ఉన్నా.. అసలు నిజాలు బయటకు వస్తాయా అనేది అనుమానమే.
Also Read: డ్రగ్స్ కేసు.. వాట్సాప్ ఛాటింగులపై సందేహాలు?
అయితే ఎటొచ్చి ఈ డ్రగ్ వ్యవహారంతో ఎక్కువుగా ఇబ్బంది పడేది, మానసికంగా నలిగిపోయేది రకుల్ ప్రీత్ సింగే అని బాలీవుడ్ మీడియా కూడా రాసుకొచ్చింది. డ్రగ్ కేసులో వినిపించిన మిగతా వాళ్ళకి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. అందుకే మీడియా కూడా వారి మీద జస్ట్ ఆరోపణలు వస్తున్నాయి అని రాసుకొస్తోంది తప్పా.. వాళ్ళ మీద ఎక్కడా బ్యాడ్ గా రాయట్లేదు. కానీ రకుల్ విషయంలో మాత్రం బాలీవుడ్ మీడియా కనికరం చూపించేలా కనిపించడం లేదు. డ్రగ్ కేసులో రకుల్ అంటూ ఆమె మీద రకరకాలుగా కథనాలను రాస్తున్నారు. అసలుకే రకుల్ ప్లాప్స్ లో ఉంది. ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంతో రకుల్ కెరీర్ ఇక కష్టమే అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.