https://oktelugu.com/

Rakul Preet Singh: బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ రంబోలా… హాట్ ఫోటోస్ వైరల్!

స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న రకుల్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. సడన్ గా ఆమె ఫోకస్ బాలీవుడ్ మీదకు షిఫ్ట్ అయ్యింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2023 / 09:57 AM IST

    Rakul Preet Singh

    Follow us on

    Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఏకంగా బికినీలో దర్శనమిచ్చింది. రకుల్ బికినీ లుక్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో స్టార్ గా వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమెకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ బ్రేక్ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ సూపర్ హిట్ కావడంతో రకుల్ వెలుగులోకి వచ్చింది.

    స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న రకుల్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. సడన్ గా ఆమె ఫోకస్ బాలీవుడ్ మీదకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ వరుస చిత్రాలు చేస్తుంది. అయితే ఫేమ్ తెచ్చిపెట్టే ఒక్క హిట్ పడలేదు. ఈ రెండేళ్ల కాలంలో రకుల్ ప్రీత్ నటించిన చాలా హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కటి కూడా హిట్ కాలేదు.

    జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ ప్రీత్ కి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లేదు. కాగా 2021లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడిని పరిచయం చేసింది. నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ ని ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. దాంతో అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. పదే పదే అడుగుతుంటే విసుగెత్తిన రకుల్ పెళ్లి కంటే జీవితంలో ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి.

    పెళ్లి కుదిరినప్పడు చెబుతానని ఆమె వెల్లడించారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని పుకార్లు వినిపించాయి. పెళ్లి సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి హ్యాపీగా విహరిస్తున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం జాకీ భగ్నానీతో కలిసి రకుల్ సాగరతీరానికి వెళ్ళింది. ఇక బికినీలో జలకాలాడుతున్న ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతుంది.