https://oktelugu.com/

Rakul Preet Singh: రకుల్ పబ్లిక్ గా అడిగేసింది.. మేకర్స్ స్పందన ఏమిటి ?

Rakul Preet Singh: హాట్ బ్యూటీ ‘రకుల్ ప్రీత్ సింగ్’ స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే, రకుల్ తన గురించి ఒక షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. తానూ పెద్దగా అందంగా ఉండను అని ఆమె నిత్యం ఫీల్ అవుతూ ఉంటుందట. నిజానికి రకుల్ అందహీనంగా ఉంది అని ఎవరు కామెంట్ చేయలేదు. ఏ నెటిజన్ ఆమెను ట్రోల్ చేయలేదు. నిజానికి రకుల్ గొప్ప అందగత్తె ఏమి కాదు. కానీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 31, 2022 / 02:03 PM IST
    Follow us on

    Rakul Preet Singh: హాట్ బ్యూటీ ‘రకుల్ ప్రీత్ సింగ్’ స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే, రకుల్ తన గురించి ఒక షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. తానూ పెద్దగా అందంగా ఉండను అని ఆమె నిత్యం ఫీల్ అవుతూ ఉంటుందట. నిజానికి రకుల్ అందహీనంగా ఉంది అని ఎవరు కామెంట్ చేయలేదు. ఏ నెటిజన్ ఆమెను ట్రోల్ చేయలేదు. నిజానికి రకుల్ గొప్ప అందగత్తె ఏమి కాదు. కానీ మంచి కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆమెకు ఉన్నాయి.

    Rakul Preet Singh

    అందుకే, ఈ బ్యూటీ తెలుగులో కొన్నాళ్ళు ఒక ఊపు ఊపేసింది. అయితే, తానూ పెద్దగా అందంగా ఉండను అని నిత్యం తనలో తానే బాధ పడుతూ ఉంటుంది కాబట్టి.. ఆ బాధను పోగొట్టుకోవడానికి, తన అందాన్ని పెంచుకోవడానికి అనేక కృత్రిమ మెరుగులు దిద్దుకుంది. ఏది అయితే ఏమి.. హీరోయిన్ గా పదేళ్లు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించింది. అయితే, వయసు పెరగడం, అమ్మడులో మునపటి పట్టు లేకపోవడంతో అవకాశాలు తగ్గాయి.

    Also Read:  పవర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్ !

    అందుకే, తాజాగా రకుల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి మాట్లాడింది. ఆసక్తిగా సాగే వినోదాత్మక కథలకు వ్యూయర్స్ నుంచి ఎప్పుడూ మంచి స్పందన లభిస్తూ ఉంటుందని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్‌ లో షో లేదా వెబ్ సిరీస్‌ లలో నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను’ అంటూ రకుల్ పబ్లిక్ గా తెలియజేసింది. మరి వెబ్ సిరీస్‌లలో నటించడానికి నేను రెడీ అని ఒక స్టార్ హీరోయిన్ చెప్పింది కాబట్టి.. ఛాన్స్ లు వరుసగా వస్తాయి అని రకుల్ అభిప్రాయం కావచ్చు. మరి మేకర్స్ స్పందన ఏమిటో చూడాలి.

    Rakul Preet Singh

    అసలు రకుల్ కి ఏ స్థాయిలో ఛాన్స్ లు వస్తాయో చూడాలి. నిజానికి టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన మకాం బాలీవుడ్ కి మార్చేసింది. అక్కడే ఆమె వరుస సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకోవడానికి చూసింది. కానీ, రకుల్ హాట్ నెస్ ఆమెకు అక్కడ పెద్దగా ప్లస్ కాలేదు. కాకపోయినా హిందీలోకి వెళ్లి అక్కడ ప్రేమలో పడింది.

    ర‌కుల్ ప్రీత్ సింగ్ యంగ్ హీరో జాకీ భగ్నానీతో ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. ఆ మధ్య వీరిద్దరూ తమ ప్రేమ గురించి ప్రపంచానికి సోషల్ మీడియా వేదికగా చాటి చెప్పారు. ఒక స్టార్ హీరోయిన్ ప్రేమిస్తోంది అంటే… ఆ వ్యక్తి బ్యాక్ గ్రౌండ్, బ్యాక్ ప్రాపర్టీస్ చూసుకునే ప్రేమిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్’ కూడా అలాగే ప్రేమించింది. జాకీ భగ్నానీ నిర్మాత కూడా.

    Also Read: ‘అన్‌స్టాపబుల్’ సక్సెస్ కి కారణం ఆమె.. సుమన్ దాతృత్వ గుణం వైరల్ !

    Tags