Rakshasudu Child Artist: బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నాడు. ఇతను భైరవం అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. విజయ్ కనకమెడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం. మే 30వ తేదీన భైరవం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమధ్య కాలంలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో జోరు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను అనే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీనివాస్ కు జోడిగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా నటించింది. మిల్కీ బ్యూటీ తమన్న కూడా అల్లుడు శీను సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో ప్రేక్షకులను అలరించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన అల్లుడు సినిమా పాటలన్నీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Also Read: పైన అరటి గెలలు.. కింద పశువులు.. పిఠాపురం నుంచేనట.. పవన్ టార్గెట్!
ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో వరుస సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం అందుకోలేకపోయాడు. కాగా త్వరలో భైరవం అనే సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ్ సినిమా రచ్చ సన్ అనే సినిమాకు రీమేక్ గా తెలుగులో రాక్షసుడు అనే సినిమా లో నటించాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అనుపమ పరమేశ్వరన్ రాక్షసుడు సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ మేనకోడలుగా నటించిన చిన్నారి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమాలో ఈ చిన్నారి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్నారి పేరు అమ్ము అభిరామి. ఈ సినిమాతో ఈ చిన్నారికి బాగా గుర్తింపు వచ్చింది. రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ చిన్నారి ప్రస్తుతం హీరోయిన్ గా మారిపోయింది. హీరోయిన్ గా తెలుగులో ఒక సినిమాలో కూడా నటించింది. ఎఫ్ సి యు కె అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అభిరామి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. రోజు రోజుకి ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది. సోషల్ మీడియాలో అభిరామి షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది.