Rakasa Movie First Review: మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల(Niharika konidela) హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది కానీ , ఒక్క సక్సెస్ కూడా చూడలేకపోయింది. కానీ నిర్మాతగా మాత్రం ఆమె రాబోయే రోజుల్లో చాలా పెద్ద రేంజ్ కి వెళ్లబోతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. అందుకు ఆమె ఎంచుకుంటున్న కథలే కారణం. ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రాన్ని నిర్మించి కెరీర్ లో భారీ మొట్టమొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నిహారిక, రీసెంట్ గానే ఆట అనే డ్యాన్స్ రియాలిటీ షోని నిర్మాతగా ప్రారంభించి మరో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఆమె ‘రాకాస'(Rakasa Movie) అనే ఈ చిత్రం తో ఏప్రిల్ 3 న మన ముందుకు రాబోతుంది. ‘మ్యాడ్’ సిరీస్ ఫేమ్ సంగీత్ శోభన్(Sangeeth Sobhan) హీరో గా , నయన్ సారిక(Nayan Sarika) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో నిన్ననే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు. మరి ఈ ప్రివ్యూ షో కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం.
సినిమా ఆరంభం లోనే ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి అయ్యే సన్నివేశం తో మొదలు అవుతుందట. ఇంత తక్కువ బడ్జెట్ తో , ఈ రేంజ్ గ్రాఫిక్స్ ఎలా సాధ్యమైంది? అని ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. అలా మొదలయ్యే ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ అనుభూతులు అందించే సన్నివేశాలతో పాటు, కామెడీ యాంగిల్ సన్నివేశాలతో సమాంతరంగా స్క్రీన్ ప్లే సాగుతూ, అదిరిపోయే రేంజ్ ఇంటర్వెల్ బ్లాక్ తో, ఒక డిఫరెంట్ సినిమాని చూసాము అనే ఫీలింగ్ ని కలిగిస్తుందట ఈ చిత్రం. సెకండ్ హాఫ్ కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు కామెడీ తో సాగిపోతుంది. ముఖ్యంగా సంగీత్ శోభన్ మరోసారి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఇరగదీశాడని సమాచారం. గెటప్ శ్రీను , సంగీత్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు పొట్టచెక్కలు అయ్యేలా చేస్తుందట.
ఇక ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సీక్వెన్స్ లు కొన్ని ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుందట. కేవలం తెలుగు లోనే కాదు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదని అంటున్నారు. సంక్రాంతి సినిమాలు తర్వాత మన టాలీవుడ్ కి ఒక్కటంటే ఒక్క సరైన సినిమా కూడా రాలేదు. కాబట్టి ‘రాకాస’ చిత్రం ప్రివ్యూ షో రివ్యూ కి తగ్గట్టుగా, పబ్లిక్ లో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టొచ్చు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందో లేదో చూడాలి.