spot_img
Homeఎంటర్టైన్మెంట్Rakasa Movie Collections: 'రాకాస' మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత గ్రాస్ రావాలో తెలుసా.....

Rakasa Movie Collections: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత గ్రాస్ రావాలో తెలుసా.. ? ఇంత బిజినెస్ ఊహించలేదు..

Rakasa Movie Collections: ‘మ్యాడ్’ సిరీస్ తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సంగీత్ శోభన్(Sangeeth Sobhan), కాసేపట్లో ‘రాకాస'(Rakasa Movie) మూవీ తో మన ముందుకు రాబోతున్నాడు. విడుదలకు ముందే ఈ చిత్రం పై ఆడియన్స్ లో మంచి ఏర్పడింది. థియేట్రికల్ ట్రైలర్, టీజర్ వంటివి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రొటీన్ కథలతో ప్రేక్షకుల బుర్రలతో ఆడుకుంటున్న దర్శకులు ఉన్న ఈ కాలంలో, ఇలాంటి సరికొత్త ఆలోచనలతో మన ముందుకు రావాలని అనుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమే. మానస దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించింది. అయితే ఎందుకో తెలియదు కానీ , ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎవ్వరూ ఊహించనంత రేంజ్ లో జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావాల్సిందే , లేదంటే అసలు పని అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు

కేవలం నైజాం ప్రాంతం లోనే ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అదే విధంగా కోస్తాంధ్ర ప్రాంతం లో 4.5 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి సీడెడ్ ప్రాంతంలో 1 కోటి 50 లక్షల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 14 కోట్ల రూపాయిల రేంజ్ బిజినెస్ జరిగింది. చిన్న హీరోల సినిమాల క్యాటగిరీ లో ఇది చాలా పెద్ద రేంజ్ బిజినెస్ అనే చెప్పొచ్చు. వరుస సూపర్ హిట్స్ అందుకొని , యూత్ లో ఎస్టాబ్లిషెడ్ హీరో గా నిలబడిన శ్రీవిష్ణు కి కూడా ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు జరగలేదు. అలాంటిది సంగీత్ శోభన్ కి ఇంత బిజినెస్ జరగడం గమనార్హం.

ఇకపోతే కాసేపట్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ మొదలు కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రీమియర్ షోస్ కి టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు వెయ్యికి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడే ఈ రేంజ్ లో ఉంటే , ఇక రేపు ఏ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోతాయో మీరే ఊహించుకోండి. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వస్తాయి. మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టగలదు ఈ చిత్రం. ఇప్పటికే ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రం తో నిర్మాతగా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న నిహారిక కొణిదెల , ఈ సినిమాతో ఎలాంటి బ్లాక్ బస్టర్ ని అందుకోబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular