Rakasa Movie Collections: సంక్రాంతి సినిమాల తర్వాత మన టాలీవుడ్ లో మళ్లీ గడ్డు కాలం మొదలైంది. రెండు నెలల్లో విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను రాబట్టలేదు. ఫిబ్రవరి నెలలో ఫంకీ తప్ప , మిగిలిన సినిమాలకు మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్. ఇక మార్చి నెలలో విడుదలయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మళ్లీ టాలీవుడ్ కి కొత్త కల తీసుకొస్తుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కనీసం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ అయినా కాపాడుతుందని అనుకుంటే , అది కేవలం వీకెండ్ వరకే పరిమితం అయ్యింది. ఇలాంటి సమయం లో ‘రాకాస’, ‘బైకర్’ చిత్రాలు ట్రేడ్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్నాయి. నేడు ఈ రెండు సినిమాలు మంచి అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని కూడా సొంతం చేసుకున్నాయి.
కలెక్షన్స్ పరంగా రెండు సినిమాలు నూన్ షోస్ నుండే హౌస్ ఫుల్స్ తో మొదలయ్యాయి కానీ, ‘బైకర్'(Biker Movie) చిత్రం కంటే ‘రాకాస'(Rakasa Movie) చిత్రానికి ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. నిన్న ప్రీమియర్ షోస్ గ్రాస్ విషయం లో కూడా ‘రాకాస’ చిత్రానిదే పై చెయ్యి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ లో కూడా నిన్న ఈ చిత్రం ప్రీమియర్స్ కి హౌస్ ఫుల్స్ పడడం గమనార్హం. చూస్తుంటే నిర్మాతగా వ్యవహరించిన నిహారిక కొణిదెల కి మరో భారీ హిట్ పడినట్టే అనిపిస్తోంది. ప్రీమియర్ షోస్ గ్రాస్ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ‘రాకాస’ చిత్రానికి 1 కోటి 20 లక్షల గ్రాస్ రాగా, ‘బైకర్’ చిత్రానికి 55 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే నమోదైంది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే బుక్ మై షో లో రెండు సినిమాల ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
‘రాకాస’ చిత్రానికి గంటకు 5 వేల టిక్కెట్లు అమ్ముడుపోతుండగా, ‘బైకర్’ చిత్రానికి గంటకు 3 వేల 500 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. సాయంత్రం షోస్ నుండి ఈ గణాంకాలు బాగా పెరగొచ్చు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ‘రాకాస’ చిత్రానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 4 నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుండగా, ‘బైకర్ ‘ చిత్రానికి 2 నుండి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాకాసి’ చిత్రం వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి, అదే విధంగా శర్వానంద్ ‘బైకర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి వారం నుండి 10 రోజుల సమయం పెట్టొచ్చని అంటున్నారు విశ్లేషకులు.
