Raju Weds Rambai Day 2 Collection: స్వచ్ఛమైన పల్లెటూరు నేపథ్యంలో సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇక అందులో బాగా రీసెంట్ గా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా వచ్చి ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ పల్లెటూరు మనుషులు ఎలా ఉంటారు. లేత మనుషుల మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది. అనే విషయాలను సైతం ఎలివేట్ చేస్తూ ఒక ఊరిలో జరిగిన యదార్థ సంఘటన ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. డైరెక్టర్ సాయిలు కంపాటి సైతం తనదైన రీతిలో సినిమాని చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు…
ఇక మొదటి షో తోనే సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా కి మొదటి రోజు కోటి 40 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండో రోజు ఈ సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ ని చూసి 100 థియేటర్లను ఎక్స్ట్రాగా కేటాయించారు. ఇక రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే షాక్ అవుతారు. రెండో రోజు కోటిన్నర వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే రెండు రోజుల్లో 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే మూడు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ వీకెండ్ మొత్తం ఈ సినిమా హావానే కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీతో రిలీజ్ అయిన 12 ఏ రైల్వే స్టేషన్, ప్రేమంటే, పాంచ్ మినార్ లాంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో సోలోగా ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా మౌత్ టాక్ తోనే ముందుకు సాగుతుండటం విశేషం… ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఈరోజు సండే కావడం వల్ల ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…