IND Vs SA: సౌత్ ఆఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. గుహవాటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలింగ్ కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం అన్నట్టుగా ఉంది. తొలి రోజు ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన టీమిండియా బౌలర్లు.. రెండవ రోజు మాత్రం వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా కీపర్ వెరైన్, భారతీయ మూలాలు ఉన్న మరో ఆటగాడు ముత్తుస్వామి టీమ్ ఇండియా బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు.
ఏడో వికెట్ కు ఇప్పటివరకు ముత్తుస్వామి, వెరైన్ 68 పరుగులు జోడించారు. తద్వారా దక్షిణాఫ్రికా జట్టు పటిష్ట స్థితికి చేరింది. రెడ్ పిచ్ మీద వికెట్లు తీయడానికి టీమ్ ఇండియా బోర్డర్లు ఆపసోపాలు పడుతున్నారు. బంతి బ్యాట్ మీదకు నేరుగా వస్తుండడంతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు.. ఆదివారం ఆట మొదలైన నాటి నుంచి ఈ కథనం రాసే సమయం వరకు దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఒక్క అవకాశం కూడా ఇండియన్ బౌలర్లకు ఇవ్వలేదంటే పిచ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఎంత ప్రయాస పడినప్పటికీ వికెట్లు దక్కడం లేదు. సిరాజ్, బూమ్రా బౌన్సర్లు వేయాలని ప్రయత్నించినప్పటికీ పిచ్ సహకరించడం లేదు.
ఇక రెండవ రోజు భారత మూలాలు ఉన్న ఆటగాడు ముత్తుస్వామి ప్రదర్శన అద్భుతంగా సాగింది. చెన్నైలోని నాగపట్నం ప్రాంతానికి చెందిన ముత్తుస్వామి కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే దక్షిణాఫ్రికా వెళ్లిపోయింది. అక్కడే స్థిరపడింది. తమిళ మూలాలు ఉన్న ముత్తుస్వామి దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో ఆడుతున్నాడు.. సరిగ్గా 2019లో దక్షిణాఫ్రికా జట్టులోకి ప్రవేశించిన అతడు.. తన కెరియర్ ను స్థిరంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా భారత జట్టుతో జరిగే మ్యాచ్ లు అంటే కచ్చితంగా అతడికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుత సిరీస్లో కూడా అతడికి దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. వచ్చిన అవకాశాన్ని ముత్తుస్వామి సద్వినియోగం చేసుకున్నాడు. గుహవాటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతడు హాఫ్ సెంచరీ చేశాడు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఎవరూ అందుకోని ఫీట్ సాధించాడు.. ముత్తుస్వామి హాఫ్ సెంచరీ చేసిన నేపథ్యంలో సరికొత్త చర్చ ప్రస్తుతం స్పోర్ట్స్ వర్గాల్లో సాగుతోంది.
ముత్తుస్వామి హాఫ్ సెంచరీ చేసిన ప్రతి టెస్ట్ మ్యాచ్ ను దక్షిణాఫ్రికా గెలిచింది. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో రవాల్పిండి వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో మొత్తం స్వామి 89* పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచింది. 2024 లో చటో గ్రామ్ వేదికగా జరిగిన టెస్టులో 68* పరుగులు చేశాడు ముత్తుస్వామి. ఈ మ్యాచ్లో కూడా దక్షిణాఫ్రికా గెలిచింది. 2019లో వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 49*, రెండవ ఇన్నింగ్స్ లో 33* పరుగులు చేశాడు ముత్తుస్వామి. అతడు హాఫ్ సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిచింది. ఈ ప్రకారం గుహవాటి మ్యాచ్ కూడా దక్షిణాఫ్రికా గెలుస్తుందా? అనే చర్చ మొదలైంది. మరి దీనిని టీమిండియా ఎలా అడ్డుకుంటుందో చూడాల్సి ఉంది.