Raju Weds Rambai Collection: ఈమధ్య చిన్న సినిమాల హవా ఎక్కువైపోయింది. లో బడ్జెట్లో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. నిజానికి భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కలెక్షన్ల విషయంలో చాలా వరకు వెనుకబడిపోతుంటే చిన్న సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్ లను సాధిస్తూ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి…ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు కోటి రూపాయల కలెక్షన్స్ ని సంపాదించుకుంది. నిజానికి సినిమా రిలీజ్ కి ముందే సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది. కారణమేంటంటే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసాయి. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సాంగ్ ని ఓన్ చేసుకొని ఈ సినిమా మీద భారీ హైప్ ను క్రియేట్ చేసుకున్నారు…
దాంతో ప్రీమియర్స్ నుంచి ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మొదటి రోజు కోటి రూపాయల కలెక్షన్స్ ను సాధించింది. అంటే ఈ సినిమా నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఈ వీకెండ్ మొత్తం ఈ సినిమా హవానే నడుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఒక డీసెంట్ లవ్ స్టోరీ ని చాలా పద్ధతిగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సినిమాతో దర్శకుడు సాయిలు కంపాటి కూడా తన పాషన్ ఏంటో? తన సినిమాలు ఎలా తీయబోతున్నాడు అనేది కూడా ప్రేక్షకులకు తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా యావత్ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు దూసుకుపోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇలాంటి యూత్ ఫుల్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది…కాబట్టి ఇక మీదట కూడా ఇలాంటి చిన్న సినిమాలు వస్తేనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చిన్న నిర్మాతలు కూడా బతుకుతారు…