Raju Weds Rambai Day 6 Collection: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాలో మంచి టాక్ ను సంపాదించుకుంటున్నాయి.ప్రేక్షకులు సైతం ఒకటికి రెండుసార్లు సినిమాలను చూస్తూ గొప్ప విజయాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది. ఆరు రోజుల్లో 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసిన ఈ సినిమా మరో వారం రోజులపాటు భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటివరకు ఏ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన కూడా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
మొత్తానికైతే ఈ సినిమాతో వేణు ఉడుగుల ప్రొడ్యూసర్ గా మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అలాగే సాయిలు కొంపాటి లాంటి యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికాడనే చెప్పాలి. ఇక సాయిలు తన తర్వాత సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది తెలియదు.
కానీ మొత్తానికైతే ఈ సినిమాని మాత్రం సక్సెస్ తీరాలకు చేర్చడంలో ఆయన తీవ్రంగా శ్రమించాడనే చెప్పాలి… ఇంత కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఈ మధ్యకాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు చాలా వరకు అవలేబుల్లో ఉండడంతో అన్ని భాషల సినిమాలను చూస్తున్న ప్రేక్షకులు మలయాళం సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు.
ఎందుకంటే ఆ సినిమాలో పెద్దగా కాంటెంట్ లేకుండా ఒక చిన్న పాయింట్ తో వాళ్లు ఎలా సినిమాని చేస్తున్నారు. ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతో స్క్రీన్ ప్లే ని రాసుకుంటారు కాబట్టి అలాంటి స్క్రీన్ ప్లే తో మంచి కథలతో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు…