Raju Weds Rambai And Andhra King Taluka: ప్రతి వారం సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే విజయాలను సాధిస్తాయి. మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగులుతాయి. ఈ నెలలో కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఏ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి అంటే చిన్న సినిమాలు పెద్ద విజయాలను సాధించడం విశేషం… ముఖ్యంగా ఈనెల 7వ తేదీన ‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల స్టామినా ఏంటో చూపించింది. అలాగే అధ్యంతం కామెడీ తో పాటు సస్పెన్స్ గొలిపే అంశాలతో తెరకెక్కింది.
కాబట్టి ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేశారు. తద్వారా సినిమాకి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ గా రావడంతో సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వచ్చాయి…ఇక ఈనెల 21వ తేదీన రాజు వెడ్స్ రాంబాయి మూవీ రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని సాధించింది.
మూడు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు 13 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక ఈ సినిమా ఈ నెలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొత్తానికైతే పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు చాలానే వచ్చినప్పటికి ఈ సినిమాలన్నింటిలో ఈ రెండు చిన్న సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…
ఇక రీసెంట్ గా రిలీజైన రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది తెలియాలంటే మరొక వారం రోజులు పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. మొత్తానికైతే ఈ నెలలో చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించి ఇండస్ట్రీలో చిన్న సినిమాల పవర్ ఏంటో చూపించాయి…