Deeksha Divas Telangana: తెలంగాణ ఉద్యమం.. దేశ చరిత్రలో అదో అలుపెరుగని పోరాటం. సబ్బండ వర్గాలు ఏకైమ ఉద్యమించిన తీరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. అయితే ఈ సంబ్బండ వర్గాలను ఏకం చేసిన నేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర స్ధాన కోసమే ప్రత్యేక పార్టీ స్థాపించిన కేసీఆర్.. స్వరాష్ట్రం కోసం మొదట లాబీయింగ్ మొదలు పెట్టారు. పార్టీలతో పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, లాబీయింగ్ పనిచేయదని గుర్తించిన గులాబీ బాస్.. తర్వాత శాంతియుత పోరాట పంథా ఎంచుకున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. దీక్ష చేపట్టి 15 సంవత్సరాలు పూర్తయిన నేటు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు జరుపుతోంది. 2009 నవంబర్ 29న కరీంనగర్ నుంచి దీక్షా స్థలం వైపు ప్రయాణిస్తుండగా అలుగునూరులో పోలీసులు ఆయనను అరెస్టు చేయడం ఉద్యమానికి కొత్త ఊపిరి పోశింది. ఈ సంఘటన దేశవ్యాప్త చర్చనీ ప్రేరేపించి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది.
దీక్ష ప్రారంభ ఘట్టం..
కరీంనగర్ తీగలగుట్టపల్లి కేసీఆర్ భవనం నుంచి సిద్దిపేట రంగధాంపల్లి వైపు బయలుదేరిన ఆయనను అధికారులు అలుగునూరు చౌరస్తాలో ఆపి ఖమ్మం జైలుకు మార్చారు. ఈ చర్య ప్రజల్లో తీవ్ర కోపాన్ని రేకెత్తించి వివిధ వర్గాల నుంచి మద్దతు వర్షించింది. జైలులోనే దీక్ష కొనసాగించిన కేసీఆర్ ధీరత్వం ఉద్యమాన్ని అమాచార దశకు చేర్చింది.
ఉద్యమంపై ప్రభావం
కేసీఆర్ దీక్ష తెలంగాణ పోరాటానికి చిహ్నంగా మారి, ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ప్రజలను ఏకం చేసింది. ఈ ఘటన దశాబ్దాల అణచివేతలకు విముక్తి దారితీసి డిసెంబర్ 9న కేంద్ర ప్రకటనకు దారితీసింది. బీఆర్‌ఎస్ ఈ రోజును పోరాట స్ఫూర్తిని పునరుజ్జీవనం చేసే అవకాశంగా చేసుకుంది.
జైలు నుంచే పోరాటానికి పిలుపు..
ఖమ్మం జైలులో కూడా దీక్ష కొనసాగించిన కేసీఆర్.. అక్కడ నుంచే పోరాటానికి పిలుపునిచ్చారు. దీంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలింది. విద్యార్థులు, కార్మికులు రాస్తారోకోలు, బంద్‌లు, ఆందోళనలతో స్పందించారు. ఈ ఉద్రిక్తత కేంద్ర దృష్టిని ఆకర్షించి, పి.చిదంబరం అర్ధరాత్రి ప్రకటనకు దారితీసింది. దీక్ష వల్ల తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్త చర్చనీయాంశమై, కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చలు వేగవంతమయ్యాయి. ఉద్యమకారులపై కేసుల ఉపసంహారం, దీక్ష విరమణకు కేంద్ర ఒత్తిడి పెరిగి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. ఈ సంఘటన తెలంగాణ చరిత్రలో ’దీక్షా దివస్‌గా’ చిరస్థాయిగా నిలిచి, పోరాట స్ఫూర్తిని ప్రతి సంవత్సరం గుర్తుచేస్తోంది.