https://oktelugu.com/

Rajkumar Hirani: రామ్ చరణ్ తో సినిమా మీద స్పందించిన డంకి సినిమా డైరెక్టర్…

రాజ్ కుమార్ హిరాని లాంటి స్టార్ డైరెక్టర్ వరుసగా మంచి సినిమాలతో సక్సెస్ లను అందుకున్నాడు కానీ రీసెంట్ గా షారుక్ ఖాన్ తో చేసిన డంకీ సినిమా మాత్రం ఫ్లాప్ అవడంతో రాజ్ కుమార్ హిరానీ మీద కొన్ని విమర్శలు అయితే వచ్చాయి.

Written By: , Updated On : December 31, 2023 / 11:21 AM IST
Rajkumar Hirani

Rajkumar Hirani

Follow us on

Rajkumar Hirani: సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పుడు ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేశాడు.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హీరానితో సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా చాలా వార్తలు వస్తున్నాయి.

అయితే రాజ్ కుమార్ హిరాని లాంటి స్టార్ డైరెక్టర్ వరుసగా మంచి సినిమాలతో సక్సెస్ లను అందుకున్నాడు కానీ రీసెంట్ గా షారుక్ ఖాన్ తో చేసిన డంకీ సినిమా మాత్రం ఫ్లాప్ అవడంతో రాజ్ కుమార్ హిరానీ మీద కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. నిజానికి ఆయన గనక ఒక సినిమాని టేకాఫ్ చేస్తే ఆ సినిమాలో ఉన్న డెప్త్ ని చూపిస్తాడు అంటూ ఇండస్ట్రీలో ఆయనకి ఒక మంచి పేరు అయితే ఉండేది.కానీ రీసెంట్ గా రెలి అయిన డంకీ సినిమాతో ఆయన చాలావరకు బ్యాడ్ నేమ్ ని సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో రాంచరణ్ తో రాజ్ కుమార్ హిరాని సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే పుష్కలంగా వస్తున్నాయి.

దానిమీద రీసెంట్ గా రాజ్ కుమార్ హిరాని స్పందిస్తూ రాంచరణ్ గారితో నేను సినిమా చేయాలని అనుకోలేదు బట్ ఫ్యూచర్ లో మాత్రం తప్పకుండా ఆయనతో ఒక సినిమా చేస్తాను ఆయన చాలా మంచి నటుడు త్రిబుల్ ఆర్ సినిమాలో ఆయన పోషించిన పాత్ర కానీ ఆయన నటించిన నటన అంటే నాకు చాలా ఇష్టం అంటూ రాంచరణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. దాంతో ఇప్పుడు ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మొత్తానికి రామ్ చరణ్ తో ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.

త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించడంతో ఇండియా లో ఉన్న స్టార్ డైరక్టర్లు అందరూ తన వెంట పడుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అట్లీ, మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా రామ్ చరణ్ తో సినిమా చేయాలని చూస్తున్నారు… చూడాలి మరి ఫ్యూచర్ లో ఆయన ఏ డైరీ టర్ కి అవకాశం ఇస్తాడో…