NTR and Prashant Neel : అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prasanth Neel) మూవీ నిన్న భారీ యాక్షన్ సన్నివేశం తో మొదలైంది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఎన్టీఆర్ అల్లర్లు జరిగే సన్నివేశాన్ని చిత్రీకరించాడు డైరెక్టర్. ఈ షెడ్యూల్ ఎన్టీఆర్ ప్రెజెన్స్ లేకుండానే మొదలైంది. మొదటి షాట్ కి సంబంధించిన ఫోటో ని నిన్న సోషల్ మీడియా లో మూవీ టీం విడుదల చేయగా,దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫొటోలో దాదాపుగా 2000 మంది ఉన్నారు.ప్రారంభమే ఇంత భారీ సీన్ తో తీస్తున్నందుకు ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ పూర్తిగా తన ఊహా లోకంలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించేవే ఉంటాయి.
కేజీఎఫ్ , సలార్ చిత్రాల్లో అవే చేసాడు. ఆయన ఆ రెండు సినిమాల్లో చూపించిన KGF , కాన్సార్ సిటీస్ ఈ భూమి మీద ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఆయన ఊహ లోకాల్లో నుండి పుట్టుకొచ్చిన సిటీస్ అవి. కానీ ఇప్పుడు తెరకెక్కబోయే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అలా ఉండదట. 1960 వ సంవత్సరం లో బెంగాల్ ప్రాంతం లో జరిగిన కొన్ని ప్రతికూల పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొట్టమొదటిసారి ఆయన తన ఊహాలోకం నుండి బయటకి వచ్చి, ఇండియా లో ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగియే సంఘటనల ఆధారంగా సినిమా తీస్తున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలవి నెగటివ్ క్యారెక్టర్స్. కేజీఎఫ్ లో హీరో నేర ప్రపంచానికి అధిపతి, అదే విధంగా సలార్ లో ఉండే కాన్సార్ సిటీ కూడా నేరాలకు నిలయం, ఆ నేర ప్రపంచాన్ని పరిపాలించాడు కొట్లాట.
ఎన్టీఆర్ ని కూడా ఇందులో అలాంటి నేరగాడిలాగానే చూపించబోతున్నాడట డైరెక్టర్. చాలా వైయొలెంట్ గా ఆయన క్యారక్టర్ ఉంటుందట. ఈ సినిమాలో నటీనటుల క్యాస్టింగ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుందట. అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు ఇందులో కనిపిస్తారట. హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ ఖరారు అయ్యింది. ఇది ఆమెనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అదే విధంగా మలయాళం స్టార్ హీరో తొనివో థామస్ కూడా ఖరారు అయినట్టు సమాచారం ఉంది. అయితే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్ ని సంప్రదించారట మేకర్స్. అందుకు ఆయన సానుకూలంగానే రెస్పాన్స్ ఇచ్చాడు కానీ, సినిమా చేస్తాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదట. ఒకవేళ కమల్ హాసన్ ఒప్పుకుంటే అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.