Rajinikanth Daughter: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా ఆమె ప్రస్తుతం ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి’ అని ఒక మెసేజ్ పోస్ట్ చేసింది.

అలాగే ఐశ్వర్య మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా చేసింది. ‘ఈ 2022..ఇంకా నా కోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది. మొత్తానికి సూపర్ స్టార్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్. ఐశ్వర్య కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి ఐశ్వర్య కరోనా విషయంలో మొదటి నుంచి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలా ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్ రావడం షాకింగ్ విషయమే. అయితే, ఐశ్వర్యకి తేలికపాటి జ్వరంతో పాటు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ బారిన పడుతున్న సెలబ్రిటీల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఏది ఏమైనా సూపర్ స్టార్ పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలియగానే బాధ పడుతున్నారు.
Also Read: హిమను మరో రుద్రాణిగా చేయనున్న రుద్రాణి.. మరో పది రోజుల్లో అంటూ షాక్ ఇచ్చిన మోనిత!
[…] Also Read: సూపర్ స్టార్ కుమార్తెకు కరోనా పాజిటి… […]
[…] Also Read: సూపర్ స్టార్ కుమార్తెకు కరోనా పాజిటి… […]