Rajinikanth Vs Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దాదాపు 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో రజినీకాంత్ మాత్రం స్టార్ హీరో పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఇక సూపర్ స్టార్ గా తనకు దక్కిన ఇమేజ్ ని అప్పటినుంచి ఇప్పటివరకు కాపాడుకుంటూ రావడమే కాకుండా 70 సంవత్సరాల వయసులో కూడా ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో పోటీపడి మరి నటిస్తూ తనకంటూ ఒక రేంజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఇక అందులో భాగంగానే చిరంజీవి రజనీకాంత్ లాంటి ఇద్దరు నటులు సౌత్ ఇండియాలోనే టాప్ స్టార్లుగా కొనసాగుతున్నారు. మరి ఇప్పటికీ కూడా వాళ్ళు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంలో ఎక్కడ దగ్గడం లేదు. ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలతో చాలాసార్లు పోటీపడ్డారు.
గత సంవత్సరం చిరంజీవి భోళా శంకర్ సినిమాతో రజినీకాంత్ జైలర్ సినిమాతో పోటీ పడ్డారు. అందులో రజనీకాంత్ పై చేయి సాధించగా చిరంజీవి బొక్క బోర్లా పడ్డాడు. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా చిరంజీవి కెరియర్ ను భారీ దెబ్బ తీసిందనే చెప్పాలి. ఇక జైలర్ సినిమా మాత్రం భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా రజనీకాంత్ కెరియర్ లోనే భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా కూడా చరిత్రలో నిలిచిపోయింది.
ఇక మరోసారి వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ చిరంజీవి ‘విశ్వంభర ‘ సినిమాతో పోటీపడే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈసారి పోటీ పడితే వీళ్ళిద్దరిలో గెలిచే టాప్ హీరో ఎవరు అవుతారనేది తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే రజినీకాంత్, చిరంజీవి ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. మరి వీళ్ళు సాధించిన విజయాల పరంగానే చూసుకున్న వీళ్ళను మించిన టాప్ హీరోలు మరెవరూ లేరనేది వాస్తవం…
అయితే కుర్ర హీరోలు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకుంటున్న నేపథ్యంలో వీళ్లు కూడా మరోసారి వాళ్ళ సత్తాని చాటి ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…