మంచు మోహన్ బాబు(Manchu Manoj) తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ, మొదటి సినిమా నుండే తన మార్కు కనపడేలా, ప్రతీ సినిమా కొత్తగా ఉండేలా, ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇచ్చేందుకు తపన పడే హీరోల్లో ఒకడు మంచు మనోజ్(Manchu Manoj). ఆ విధంగా ఆయన సక్సెస్ అయ్యాడు కూడా. కెరీర్ మంచి ఊపుతో వెళ్తున్న సమయం లో ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు కారణంగా పదేళ్ల వరకు సినిమాలకు దూరం అవ్వడం వంటివి జరిగింది. అలాంటి మనోజ్ మళ్లీ ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి ఆయన రీ ఎంట్రీ ‘మిరాయ్’ తోనే జరిగింది. కానీ ముందుగా ‘భైరవం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆయన కాస్త నెగిటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ చేసాడు.
ఇప్పుడు మిరాయ్ చిత్రం లో కూడా అలాంటి క్యారక్టర్ నే చేసాడు. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ఈ నెల 12న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు మనోజ్. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రీసెంట్ గా రజినీకాంత్(Super Star Rajinikanth) ని కలిసినప్పుడు జరిగిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ ఇటీవలే రజినీకాంత్ గారిని కలిసి మా మిరాయ్ మూవీ ట్రైలర్ ని చూపించాను. ఆయనకు చాలా నచ్చింది. వెరీ గుడ్, ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండు. ఇంతకు ముందు లాగా మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇవ్వకు అని అన్నాడు. గతం లో నేను సినిమాలకు బ్రేక్ ఇచ్చానని విషయం తెలుసుకొని, రజినీకాంత్ గారు నన్ను ఇంటికి పిలిచి ఫుల్ క్లాస్ పీకాడు. సినిమాలు చేయకుండా ఏమి పీకుతున్నావ్ నువ్వు అనేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా మిరాయ్ సినిమా గురించి మనోజ్ మాట్లాడుతూ ‘ఇందులో హీరో, విలన్ అని ఎవ్వరూ ఉండరు. రెండు అద్భుతమైన శక్తులకు మధ్య జరిగే పోరాటమే ఇది. ఇందులో నేను మోడరన్ రావణుడి క్యారక్టర్ పోషించాను. రావణుడి జీవితం లో సీత అడుగు పుట్టకముందు ఎలా ఉండేవాడో, అలా ఉంటుంది నా క్యారక్టర్. ఆడవాళ్ళ జోలికి పోడు, అదే విధంగా సోమరిపోతులు లాగా భూమి మీద బ్రతుకుతూ ఏ పని చెయ్యని వాడు బ్రతికి ఉండడం వృధా, కష్టపడే వాళ్లకు మాత్రమే ఈ భూమి మీద జీవించే హక్కు ఉంది అంటూ బలంగా నమ్మే క్యారక్టర్ నాది’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ అయితే ఉంది, హిట్ అయితే మంచు మనోజ్ జాతకం మారిపోతుంది అనుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఆయన డేవిడ్ రెడ్డి, రక్షక్ మరియు అత్తరు సాయిబు వంటి చిత్రాల్లో హీరోగా కనిపించబోతున్నాడు.