Rajinikanth: హీరోగా రజినీకాంత్ ఐదు దశాబ్దాలకు పైగా ప్రస్థానం కలిగి ఉన్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండా స్టార్ గా ఎదిగారు. రజినీకాంత్ కి ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. చెప్పాలంటే ఆయనే ఫస్ట్ పాన్ ఇండియా హీరో. జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. రజినీకాంత్ సినిమాకు రూ. 150 నుండి 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. జైలర్ చిత్రానికి రజినీకాంత్ రూ. 210 కోట్ల వరకు అందుకున్నారని సమాచారం. రజినీకాంత్ మాత్రమే ఈ తరం స్టార్ హీరోలకు సమానంగా స్టార్డం అనుభవిస్తున్నారు.
ఆయన సమకాలీన స్టార్స్ పరిశ్రమలో ఉన్నప్పటికీ వారికి రజినీకాంత్ రేంజ్ లేదు. రజినీకాంత్ ప్రస్తుత వయసు 73. డిసెంబర్ 12న ఆయన 74వ ఏట అడుగుపెడతారు. ప్రస్తుతం ఆయన కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. నాగార్జున ఒక కీలక రోల్ చేస్తున్నాడు. అనంతరం రజినీకాంత్ జైలర్ 2 చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే కూలీనే రజినీకాంత్ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.
రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. అందుకు అనారోగ్య సమస్యలే కారణం అట. ఎప్పటి నుండో రజినీకాంత్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా ఆయన సీరియస్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నాడట. అమెరికాలో రజినీకాంత్ కి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ జరిగింది. ఇటీవల కూడా ఆయనకు స్టెంట్ వేశారు. ఆరోగ్యం సహకరించని కారణంగానే రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
వైద్యులు రజినీకాంత్ కి కొన్ని సలహాలు ఇచ్చారట. ఒత్తిడికి గురి కాకుండా రెస్ట్ తీసుకోవాలని అన్నారట. వైద్యుల సూచనల మేరకు రజినీకాంత్ శాశ్వతంగా సినిమాలకు దూరం కావాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అయితే కూలీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ కి విక్రమ్ రూపంలో లోకేష్ కనకరాజ్ భారీ హిట్ ఇచ్చారు.