Rajinikanth RGV Combination: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు రజనీకాంత్…ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి స్టార్ ఇమేజ్ ని సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు చేస్తున్న సినిమాలు సైతం అతనికి మంచి ఐడెంటిటి ని సంపాదించి పెడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రేపు ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇండియా మొత్తం రజనీకాంత్ సినిమాని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం… మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు తన డ్రీమ్ ప్రాజెక్టుగా పెట్టుకుంటాడు…మరి ఇలాంటి సందర్భంలోనే ‘శివ’ సినిమాతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ కూడా అప్పట్లో రజనీకాంత్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
అయితే ఆర్జీవీ రజనీకాంత్ కి కథ చెప్పిన కథను ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేశాడట… అలాంటి మేకింగ్ రజనీకాంత్ కి పెద్దగా ఇష్టం లేకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలందరితో సినిమాలు చేయాలనుకున్న ఆర్జీవి చిరంజీవి రజనీకాంత్ లాంటి హీరోలతో మాత్రం సినిమాలు చేయలేకపోయాడనే చెప్పాలి.
ఇక ఒకానొక సందర్భంలో సర్కార్ సినిమాని సైతం రజనీకాంత్ తో చేయాలని ఆర్జీవీ అనుకున్నప్పటికి రజినీకాంత్ అప్పుడు కొన్ని సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన కోసం వెయిట్ చేయడం ఇష్టం లేని వర్మ అమితాబచ్చన్ తో ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక మొత్తానికైతే వాళ్ళ కాంబినేషన్ కి భారీ ఇమేజ్ రావడంతో వర్మ అప్పటినుంచి అమితాబచ్చన్ తోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు.
మరి ఏది ఏమైనా కూడా వర్మ అప్పట్లో ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం వర్మ అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అయితే లేవు. ఆయన చేసిన సినిమాలు కూడా అన్ని చిన్న చిన్న హీరోలతో చేస్తూ ఇండస్ట్రీకి కొత్త వాళ్ళను పరిచయం చేయాలని చూస్తున్నాడు. ఇక పూర్తిగా ఫామ్ ను కోల్పోయిన వర్మతో ఏ స్టార్ హీరో వర్క్ చేసే అవకాశం అయితే లేదు…