Nagarjuna Special Song In Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie), రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు మెంటలెక్కిపోతున్నారు. కేవలం ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే సాధారణమైన విషయం కాదు. ఇప్పటి వరకు కేవలం ‘పుష్ప 2’ కి మాత్రమే ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) విలన్ రోల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ఆయన్ని ఎంత క్రూరంగా చూపించాలో అంత క్రూరంగా చూపించాడు. మొదట్లో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడంటే అక్కినేని ఫ్యాన్స్ అంగీకరించలేకపోయారు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
కానీ దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఇంతటి క్రేజీ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేయడం వల్ల నాగార్జున కి లాభమే కానీ, ఒక్క పైసా నష్టం కూడా లేదు అని వాళ్లకి వాళ్ళు సర్దిచెప్పుకున్నారు. అయితే నాగార్జున ని ఈ చిత్రం లో హీరో కంటే తక్కువ ఎక్కడా చెయ్యలేదని తెలుస్తుంది. రజినీకాంత్ కి ఉన్నట్టుగానే నాగార్జున కి కూడా ఒక పాట ఉంది. కాసేపటి క్రితమే ఈ పాట విడుదలైంది. ‘ఐయామ్ ది డేంజర్’ అంటూ సాగే ఈ పాటలో నాగార్జున ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. నేటి తరం కుర్ర హీరోలు కూడా ఆయన అందాన్ని మ్యాచ్ చేయడం కష్టం అనే రేంజ్ లో నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటలో ఉంది. ఆయన చాలా కాలం తర్వాత ఇందులో మాస్ స్టెప్పులు కూడా వేసినట్టు అనిపిస్తుంది. ఈమధ్య కాలం లో నాగార్జున ని ఇంత అందంగా, ఇంత స్టైలిష్ గా ఎవ్వరూ చూపించలేకపోయారని అక్కినేని అభిమానులు కూడా అంటున్నారు.
చూస్తుంటే అక్కినేని ఫ్యాన్స్ కి నాగార్జున రోల్ ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుందని తెలుస్తుంది. రజినీకాంత్ కూడా ప్రత్యేకించి మొన్నటి స్పెషల్ వీడియో లో చెప్పుకొచ్చాడు. నాగార్జున ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఒక పండుగ లాంటిది అని. మరి నాగార్జున నట విశ్వరూపం ఏ రేంజ్ లో ఉండబోతుందో మరికొద్ది గంటల్లోనే తేలనుంది. ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీ కి బాగా కలిసొచ్చింది. ఏడాది ప్రారంభం లో నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య నటించిన ‘తండేల్’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి, అక్కినేని ఫ్యామిలీ కి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ఈ చిత్రం తర్వాత నాగార్జున ప్రధాన పాత్ర పోషించిన ‘కుబేర’ కూడా సూపర్ హిట్ రేంజ్ ని అందుకొని వంద కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టింది. ఇప్పుడు కూలీ చిత్రం ఆయన కెరీర్ ని ఎక్కడ దాకా తీసుకెళ్తుందో చూడాలి.