Rajinikanth , Pawan Kalyan
Rajinikanth and Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు చాలా మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాలు ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారనే వార్త వింటే చాలు యావత్ సినిమా ప్రేక్షకులంతా ఆనంద పడుతూ ఉంటారు. స్టార్ హీరోలను ఒక ఫ్రేమ్ లో చూస్తే చాలు ఎవరికైనా ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అలాంటి రజినీకాంత్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేయడానికి సిద్ధమవుతూ ముందుకు సాగుతున్నాడు. 2023 వ సంవత్సరంలో ‘ జైలర్ ‘ (Jailer)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 400 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాడు. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా హీరోలకు సైతం గట్టి పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు. మాఫియా డాన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్న రజనీకాంత్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మరోసారి షేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
Also Read : రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ఇద్దరు వాళ్ల సినిమాలతో బాక్సాఫీస్ ను ఊచకోత కోయబోతున్నారా..?
ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వపరంగా కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. గతంలో రజినీకాంత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా రాబోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
నిజానికి దర్శకుడు సురేష్ కృష్ణ వీళ్లిద్దరి కాంబోలో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు కారణం ఏదైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో కనక సినిమా వచ్చినట్లైతే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుందనే యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా కోరుకున్నారు. కానీ అనుకున్న విధంగా ఈ సినిమా అయితే పట్టాలెక్కలేక పోయింది. కారణం ఏదైనా కూడా అటు రజనీకాంత్ అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారనే చెప్పాలి.
ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే రజనీకాంత్ మహా అయితే ఇంకో నాలుగు సినిమాలకంటే ఎక్కువ చేయలేడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావడం అనేది అసాధ్యమనే చెప్పాలి…
Also Read : పవన్ కళ్యాణ్ రజినీకాంత్ ఇద్దరు ఈ డైరెక్టర్లను నమ్మి మోసపోయారా..?