Jailer Showcase : రజినీకాంత్ తబలా రేంజ్ హిట్టు కొట్టి దశాబ్దం అవుతుంది. 2.0 తర్వాత క్లీన్ హిట్ పడలేదు. తెలుగులో అయితే ఆయన సినిమాలను జనాలు పట్టించుకోవడం మానేశారు. ఒక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం రజినీకాంత్ ఎదురుచూస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ జైలర్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదల తేదీ దగ్గర పడగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. జైలర్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
రెండున్నర నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. యాక్షన్ డోస్ బాగా ఎక్కువగా ఉంది. రజినీకాంత్ పాత్రలోని షేడ్స్ ఆసక్తి రేపుతున్నాయి. మొదట్లో రజినీకాంత్ ని మాసిక రోగిగా చూపించారు. అమాయకంగా, మౌనంగా ఉండే అతనికి భారీ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. అసలు ఎవరీ వ్యక్తి. మాఫియాతో ఇతనికి గొడవేంటీ?. రజినీకాంత్ నిజ స్వరూపం ఏమిటీ అనే అంశాల సంమాహారమే జైలర్ ట్రైలర్. రజినీకాంత్ క్యారెక్టర్ కొత్తగా ఉంది.
దర్శకుడు నెల్సన్ హీరో పాత్రలను డిఫరెంట్ గా డిజైన్ చేస్తాడు. వాళ్ళను నిమ్మళంగా చూపిస్తారు. డాక్టర్ మూవీలో శివ కార్తికేయ రోల్ కూడా భిన్నంగా ఉంటుంది. అదే తరహా షేడ్స్ రజినీకాంత్ పాత్రలో చూడొచ్చు. ఆయన ఒక ఫ్యామిలీ మాన్ లా కనిపించారు. పోలీస్ ఆఫీసర్ తండ్రి. రమ్యకృష్ణ ఆయన భార్య. సునీల్ కూడా ట్రైలర్ లో కనిపించాడు. హీరోయిన్ తమన్నాను ఎందుకో మిస్ చేశారు. తమన్నాకు కథలో ప్రాధాన్యత ఉండదని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
మొత్తంగా జైలర్ ట్రైలర్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. అనిరుధ్ మ్యూజిక్ బాగుంది. రజినీకాంత్ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఉన్నాయి. జైలర్ ఆగస్టు 10న విడుదల కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ శ్రాఫ్ వంటి భారీ క్యాస్ట్ నటిస్తున్నారు. ట్రైలర్ చూశాక అంచనాలు పెరిగిపోయాయి.
